Telangana: తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విషయాలు !
సమస్యలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొనలేక.. చిన్నచిన్న కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతున్నదని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆత్మహత్యలకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. తెలంగాణలో గంటకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని NCRB గణాంకాలు పేర్కొంటున్నాయి.
Telangana: దేశంలో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఇటీవల పలు సర్వే రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ ధోరణి ఆందోళన కలిగించే విషయమనీ, ప్రభుత్వాలతో పాటు సమాజంపైనా దీనికి పరిష్కారాలు కనుగొనే బాధ్యత ఉందని వెల్లడించాయి. ఇక తెలంగాణలోనూ చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నదని National Crime Records Bureau నివేదిక పేర్కొంది. గత కొన్ని సంత్సరాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు అధికమవుతన్నారని తెలిపింది. NCRB తాజా నివేదిక వివరాల ప్రకారం.. Telangana గతేడాది (2020)లో 8058 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంది. ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య అంతకు ముందు ఏడాది(2019)లో 7675 గా ఉందని National Crime Records Bureau నివేదిక పేర్కొంది. గతేడాది ఆత్మహత్యలను గమనిస్తే తెలంగాణలో ప్రతి రోజు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, 2020లో రోజుకు సగటున 22 మంది ఆత్మహత్యలు అంటే దాదాపు గంటకు ఒకరు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.
Also Read: Ponnala Lakshmaiah: లోపల దోస్తీ.. బయట కుస్తీ !
National Crime Records Bureau డేటా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు దాదాపు 21.5 శాతం పెరుగుదలను నమోదుచేసిందని తెలుస్తోంది. 2019తో పోలిస్తే, 2020లో ఆత్మహత్యల సంఖ్య దాదాపు 5.05 శాతం పెరిగింది. దేశంలో ఆత్మహత్యల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో Telangana కూడా ఒకటిగా ఉందని ఎన్సీఆర్బీ డేటా స్పష్టం చేస్తోంది. అయితే, బలవంతంగా తమ ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆత్మహత్యలకు ప్రజల్లో అధికమవుతున్న మానసిక దౌర్బల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Telangana లో ఆత్మహత్యలు పెరగడానికి మరో షాకింగ్ అంశం కుటుంబ కలహాలు. 50 శాతానికి పైగా కేసుల్లో ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమని తేలింది. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో జీవించడం వల్ల కుటుంబ వివాదాలు సులువుగా పరిష్కారమయ్యేవనీ , ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు చిన్న కుటుంబాల రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కరోనా వైరస్ వెగులుచూసిన తర్వాత కూడా ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడిందనీ, కోవిడ్-19 కూడా ఆత్మహత్యలు పెరగడానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Coronavirus:పెరుగుతున్న కరోనా కొత్త కేసులు.. 11.6 శాతం అధికం
National Crime Records Bureau నివేదిక వెల్లడించిన దేశవ్యాప్త ఆత్మహత్యల వివరాలు గమనిస్తే.. కరోనా వెలుగుచూసిన గతేడాది (2020)లో అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1,53,052 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.ఈ సంఖ్య అంతకు ముందు ఏడాది (2019) తో పోలిస్తే 10 శాతం కంటే అధికంగా పెరిగిందనిNCRB నివేదిక గణాంకాలు పేర్కోంటున్నాయి. అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముందువరుసలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నాటక, మహారాష్ట్రలో ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది . దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.1 శాతం నమోదయ్యాయని తెలుస్తోంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలతో పాటు యువకుల సంఖ్య పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Omicron Variant: మహారాష్ట్రలో కోలుకున్న ‘ఒమిక్రాన్’ బాధితుడు