వెంకయ్య విషయంపైనే ఇంట్లో తండ్రి, కొడుకుల మధ్య చర్చ జరిగిందట. వెంటనే లోకేష్ ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించాలని చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబు ఎగిరి గంతేసారట. వెంటనే  నరేంద్రమోడికి ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పేయటం, మోడి ఒప్పేసుకోవటం చకచకా జరిగిపోయాయట. దాంతో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి యోగం పట్టేసింది.

పదవులు ఇప్పించటంలో నారా లోకేష్ తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునే మించిపోయేట్లున్నారు. దేశంలో ఎవరికి ఏ కీలక పదవి వచ్చినా, ఏ కీలక పరిణామం చోటు చేసుకున్నా తాన వల్లే పదవైనా, పరిణామమైనా సంభవించినట్లు ఇంతకాలం చంద్రబాబు మాత్రమే చెప్పుకునే వారు. అందుకు చరిత్రను చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. అయితే, అదంతా పాత చింతకాయ పచ్చడైపోయింది. తాజా కబురేంటంటే, వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి నారా లోకేష్ ఆలోచన వల్లే దక్కిందట.

ఇదంతా ఎవరో గిట్టని వారు జోకులేసుకుని చెప్పుకోవటం కాదు. స్వయంగా నారా లోకేషే చెప్పారు. రాష్ట్రానికి సేవలందించిన వెంకయ్యకు ఏదైనా చేయాలని చంద్రబాబు తెగ ఆలోచిస్తుండేవారట.అప్పటికేదో వెంకయ్య నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామంలో కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్నట్లు. వెంకయ్య విషయంపైనే ఇంట్లో తండ్రి, కొడుకుల మధ్య చర్చ జరిగిందట.

వెంటనే లోకేష్ ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించాలని చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబు ఎగిరి గంతేసారట. వెంటనే సిఎం నరేంద్రమోడికి ఇదే విషయాన్ని చెప్పేయటం, మోడి ఒప్పేసుకోవటం చకచకా జరిగిపోయాయట. దాంతో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి యోగం పట్టేసింది.

ఇంతకీ విషయమేంటంటే, అసలు వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతికి వెళ్ళటమే ఇష్టం లేదు. ఆ విషయాన్ని స్వయంగా వెంకయ్యే చెప్పుకున్నారు. ఇక, చంద్రబాబంటార, వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లటం వల్ల అభివృద్ధిపరంగా రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. రాజకీయంగా మాత్రం నష్టమని చెబుతున్నారు. రాజకీయంగా నష్టమంటే ఎవరికి? చంద్రబాబునాయుడుకే కదా? మరి, తనకు నష్టం వచ్చే పని చంద్రబాబు చేయరుగాక చేయరన్న విషయం ఎన్నోమార్లు రుజువుకూడా అయింది.

ఇంక వెంకయ్యకు లోకేష్ ఉపరాష్ట్రపదవి ఇప్పించేదేముంది? ఒకవైపు వెంకయ్యకు ఇష్టంలేని పదవిలోకి వెంకయ్యను పంపుతూ, ఇంకోవైపు చంద్రబాబును రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టటమే కదా లోకేష్ చేసింది? ఇంతకీ లోకేష్ చేసింది మేలా లేక కీడా?