Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్: మైలవరం టిక్కెట్టు ఎవరికో?


మైలవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్‌సీపీ తెలుగు దేశం పార్టీలో  చేరారు.  అయితే  వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరికతో  మైలవరం టిక్కెట్టు ఎవరికి దక్కుతుందోననే చర్చ సాగుతుంది.

 Vasantha krishna Prasad joins in TDP, Who will be bet  Mylavaram TDP Ticket lns
Author
First Published Mar 2, 2024, 2:48 PM IST

విజయవాడ: మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)ని వీడి శనివారం నాడు తెలుగు దేశం పార్టీలో చేరారు.  హైద్రాబాద్ లో  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో  వసంత కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీలో  చేరారు.  మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని  తన అనుచరులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి వసంత కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరారు. గత కొంతకాలంగా  వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.  వసంత కృష్ణ ప్రసాద్  తెలుగు దేశం పార్టీలో చేరడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 

గత మాసంలో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు భేటీ అయిన విషయం తెలిసిందే. గత మాసంలో  తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో  దేవినేని ఉమకు కూడ చోటు దక్కలేదు.

also read:'సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకతే': వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిక

మైలవరం నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ కు  టిక్కెట్టు కేటాయిస్తారా మాజీ మంత్రి దేవినేని ఉమను బరిలోకి దింపుతారా అనే విషయమై స్పష్టత రాలేదు. మరో వైపు  మైలవరం నుండి పోటీ చేస్తానని  టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు కూడ ప్రకటించారు.మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  దేవినేని ఉమకు  బొమ్మసాని సుబ్బారావు మధ్య కూడ  గ్యాప్ పెరిగిందనే ప్రచారం సాగుతుంది.ఈ దఫా పోటీ చేయడానికి బొమ్మసాని సుబ్బారావు  రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. అయితే  ఈ తరుణంలో  వసంత కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరడంతో మైలవరం టిక్కెట్టు కోసం  ముగ్గురి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

also read:రెండో జాబితాపై పవన్ కసరత్తు: 10 మందికి చోటు?

మాజీ మంత్రి దేవినేని ఉమకు జిల్లాలోని మరో అసెంబ్లీ స్థానం నుండి  టిక్కెట్టు కేటాయించే విషయమై  ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్టుగా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.  జనసేనతో పొత్తు నేపథ్యంలో  సీట్లు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు  గత నెలలో  పార్టీ నేతలకు సూచించారు.

also read:ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  ఇవాళ తెలుగు దేశం పార్టీలో చేరారు. అయితే మైలవరం అసెంబ్లీ స్థానంలో తనకు  టిక్కెట్టు కేటాయించినా పోటీ చేస్తానన్నారు. దేవినేని ఉమకు గానీ, బొమ్మసాని సుబ్బారావుకు కేటాయించినా  తాను వారి గెలుపునకు సహకరిస్తానని  వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.

also read:175 ఎకరాల రక్షణ శాఖ భూమి తెలంగాణకు కేటాయింపు: ఎలివేటేడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్

తెలుగు దేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో మైలవరం అసెంబ్లీ టిక్కెట్టును ప్రకటించలేదు. వసంత కృష్ణ ప్రసాద్ కోసమే తొలి జాబితాలో ఈ స్థానం చేరలేదా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే  పార్టీ సీనియర్ గా ఉన్న దేవినేని ఉమను కాదని  వసంత కృష్ణ ప్రసాద్ కు తెలుగు దేశం పార్టీ టిక్కెట్ కేటాయిస్తుందా, బొమ్మసాని  సుబ్బారావుకు ఎలా సర్ది చెబుతారనే విషయమై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios