Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు  ఇవాళ, రేపు సమావేశం కానున్నారు.రానున్న ఎన్నికల విషయమై కమలం పార్టీ కసరత్తు చేస్తుంది.

Andhra Pradesh Assembly Elections 2024:BJP key meeting in Andhra Pradesh For Elections lns
Author
First Published Mar 2, 2024, 11:01 AM IST


అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన ఎన్నికల కోర్ కమిటీ  శనివారం నాడు  భేటీ కానుంది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  ఆ పార్టీ  కసరత్తు చేసే అవకాశం లేకపోలేదు.

also read:12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

రెండు రోజుల పాటు  ఈ కోర్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ  కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై  భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరి ప్రకటించారు. 

also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?

రాష్ట్రంలోని  175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు  సుమారు  2, 500 మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఈ ధరఖాస్తులను బీజేపీ త్రిసభ్య కమిటీ  పరిశీలించనుంది. ధరఖాస్తు చేసుకున్న ఆశావాహుల నుండి  అప్లికేషన్లను  పరిశీలించి బీజేపీ కేంద్ర కమిటీకి పంపనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  బీజేపీ కేంద్ర నాయకత్వం  కసరత్తు చేస్తుంది. రెండు రోజుల్లో ఈ జాబితాను  ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరు నుండి పది మందికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

also read:బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గత మాసంలో  బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఆ మరునాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ భేటీ అయ్యారు.  తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై  ఈ వారంలో తేలే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు.  ఈ  విషయమై  స్పష్టత వస్తే   మిగిలిన  స్థానాల్లో  అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాలను ఇటీవల విడుదల చేశారు. రెండో జాబితాను కూడ విడుదల చేసేందుకు  రెండు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios