Asianet News TeluguAsianet News Telugu

రెండో జాబితాపై పవన్ కసరత్తు: 10 మందికి చోటు?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాపై జనసేన కసరత్తు చేస్తుంది. ఇప్పటికే  ఫస్ట్ లిస్ట్ ను జనసేన విడుదల చేసింది. 

Janasena Chief Pawan Kalyan To Prepare candidates second list for andhra pradesh assembly elections 2024 lns
Author
First Published Mar 2, 2024, 12:44 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి ఇప్పటికే  99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.  అయితే  రెండో జాబితా విడుదల కోసం రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

also read:ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ

జనసేనకు  24 అసెంబ్లీ,3 పార్లమెంట్ స్థానాలను తెలుగు దేశం పార్టీ కేటాయించింది.  తమకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో గత నెలలో  జనసేన ఐదు స్థానాలను ప్రకటించింది. ఇంకా  19 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో  అభ్యర్థులను  జనసేన ప్రకటించాల్సి ఉంది. 

రానున్న రెండు మూడు రోజుల్లో  రెండో జాబితాపై జనసేన నాయకత్వం సిద్దం చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ,జనసేన సభ తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హైద్రాబాద్ కు వెళ్లారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. జనసేన అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది.

also read:12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

రెండో జాబితాలో ఏ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో  సర్వే నివేదికలను  ఆధారంగా చేసుకొని  అభ్యర్థులను జనసేన నాయకత్వం  ఎంపిక చేయనుంది.

రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులకు చోటు దక్కే అవకాశం ఉందని  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.  తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై ఈ రెండు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. పొత్తు విషయమై బీజేపీ నాయకత్వం నుండి స్పష్టత వచ్చిన తర్వాత  చివరి జాబితాను ఈ రెండు పార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి.  అయితే  ఇప్పటికే  94 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.  పొత్తుపై  బీజేపీ వైఖరి తేలిన తర్వాత  మిగిలిన స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios