గుంటూరు: అధికార పార్టీని, అధికార పార్టీ నాయకులను తిడుతూ పెట్టిన వీడియో వైరల్ అయినందునే చిత్తూరు జిల్లాకు చెందిన ఓంప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరికి తెలుసని టిడిపి పొలిట్ బ్యూర్ సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై, దళితులపై అధికార వైసీపీ నాయకులు, పోలీసులు సాయంతో గొంతు నొక్కుతున్న విధానాన్ని చూస్తున్న వారందరికి ఓంప్రతాప్ కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని అర్ధయవుతుందని ఆరోపించారు. మృతుడు ఓంప్రతాప్ ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలిస్తే విషయం అసలు నిజాలు తెలుస్తాయని రామయ్య అన్నారు.

''తూర్పు గోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ముద్దాయి అయిన కవల కృష్ణమూర్తిని ఇంత వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ లో శిరోముండనం జరిగిన రోజు కృష్ణమూర్తి ఎస్సై ఫిరోజ్ అలీ కి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. కావున సస్పెండ్ కాబడిన ఎస్సై ఫోన్ కాల్ లిస్ట్ కూడా పరిశీలించాలి'' అని సూచించారు.

read more  పవన్ కల్యాణ్ వస్తున్నాడు, జగన్ సంతకం చేయాల్సిందే: రఘురామ

''అలాగే స్థానిక పోలీసుల సూచన మేరకు  బి కొత్త కోట మండల తహశీల్ధార్ దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణని సిఆర్పిసి సెక్షన్ 145 ప్రకారము ఇంటిలో నుంచి బయటకు రాకూడదని నోటీసు ఇచ్చారు. దీనితో రామకృష్ణ అయన కుటుంబ సభ్యులు ఇంటికే పరిమితము కావాల్సి వచ్చింది. ఈ విషయములో తప్పు చేసిన అధికారులు పై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'' వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా వారిపై కక్ష్య పెంచుకుని అధికార పార్టీ నాయకులు దాడుల చేస్తున్నారు. ఈ నేపథ్యములో ఇటీవల దళితుల పై జరిగిన దాడుల పై సమీక్ష నిర్వహించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ (PoA) చట్టము, 1989 ని సరి అయిన విధముగా అమలుపరచాలి. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యముగా దళితులకు న్యాయ వ్యవస్థ పై నమ్మకము ఏర్పడుతుంది'' అంటూ దళితులపై జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని డిజిపిని వర్ల రామయ్య కోరారు.