అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై టీడీపీ నేత మాజీ మంత్రి ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాను తగ్గించేందుకే ఇలా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఉమా అన్నారు. అసెంబ్లీలో శ్రీరంగ నీతులు చెప్పే జగన్ ఇలా తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. 

Also read: పదో తరగతి పేపర్ లీక్ లో జగన్ పట్టుబడ్డాడు: నారా లోకేష్

చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతే ఆరుగురు గన్ మెన్లు తగ్గుతారు తప్ప పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని ఉమా అభిప్రాయపడ్డారు. జగన్ పిచ్చి చర్యలకు టీడీపీ భయపడదని అన్నారు. 

టీడీపీని కానీ లోకేష్ ని కానీ, తనను కానీ తిట్టడానికి వైసీపీలో ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు సరిపోలేదా అంటూ, కొత్తగా తెచుకున్నవారు అవసరమయ్యారా అని ప్రశ్నించారు. జగన్ పార్టీలోని 150 మంది ఎమ్మెల్యేలకు తమను తిట్టే సరుకు లేదా అంటూ ఎద్దేవా చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలకు చేతకాదా? చావలేదా? దద్దమ్మలా అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 

కేసులు పెట్టి భయపెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటున్నారని, ఇదంతా జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్తులే అని ఉమా వ్యాఖ్యానించారు. సన్నబియ్యం ఇయ్యలేని సన్నాసి కోడలి నాని అని, అతను కూడా తమను తిట్టేవాడయ్యాడా అని, అతను రెండున్నరేళ్ల మంత్రి మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్ రెండున్నర సంవత్సరాల తరువాత కేబినెట్ మార్పు చేయనున్న విషయాన్నీ గుర్తు చేసారు. 

చంద్రబాబు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళ ఫోన్ నంబర్లు, పేర్లు జగన్ కి ఎందుకఅని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్న వంశీ మాట్లాడిందంతా జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని అన్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉంటారని, హిందూ మాత విశ్వాసాలను దెబ్బ తీసేందుకు అయ్యప్ప మాలలో ఉన్న వారితోనే కూడా తిట్టిస్తున్నారని అన్నారు. ఇది ఒక రకంగా హిందూ మాత విశ్వాసాలపై దాడి అని అన్నారు.  

Also read: ఓ పప్పు, చుట్టూ బఫూన్లు: లోకేష్‌పై వంశీ తిట్ల వర్షం

టీడీపీ పార్టీని జగన్ తండ్రైన రాజశేఖర్ రెడ్డియే ఎం చేయలేకపోయాడని జగన్ కూడా ఎం చేయలేదని అన్నాడు. ఇసుకకోరతా జగన్ సృష్టేనని, జే ట్యాక్స్ రూపంలో లిక్కర్ విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని వేలకోట్లు అందాయని ప్రశ్నించారు. జగన్ కి ఇష్టమైన నాలుగైదు బ్రాండ్లు మాత్రమే జనాలు తాగాలని, వారి తెలివితక్కువ నిర్ణయం వల్ల ఎక్సయిజ్ ఆదాయం పక్క రాష్ట్రాలకు తరలిపోయిందని అన్నారు. జగన్ కు జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అమ్మకాలు సాగించవచ్చని అన్నారు. 

Also read: ఆయన దద్దమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే: లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్

జగన్ అభద్రతా భావంతో ఉన్నాడుఅని అన్నారు. కావాలి ఇసుక, పోవాలి జగన్అని ప్రజలు అంటున్నారఅని అన్నారు. ఇసుక ఆపినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. 

నాడు వైఎస్ తిట్టారు, నేడు జగన్ తిట్టిస్తున్నాడు.. ఎవరు తిట్టినా టిడిపికి ఏం కాదు అని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఎట్టిపరిస్థుతుల్లోనైనా కాపాడతాం అని అన్నారు.