Asianet News TeluguAsianet News Telugu

ఆయన దద్దమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే: లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్

లోకేశ్ దద్దమ్మ అని అందరికీ తెలుసునన్నారు వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని. లోకేశ్ గురించి చంద్రబాబుకు తెలుసు కాబట్టే అడ్డదారిలో పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 

minister kodali nani slams nara lokesh over jr ntr issue
Author
Amaravathi, First Published Nov 15, 2019, 7:54 PM IST

లోకేశ్ దద్దమ్మ అని అందరికీ తెలుసునన్నారు వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని. లోకేశ్ గురించి చంద్రబాబుకు తెలుసు కాబట్టే అడ్డదారిలో పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత పరిస్ధితుల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే పార్టీని నడిపే సత్తా వుందని.. తెలుగుదేశం పార్టీ బతకాలంటే నందమూరి వారసులకే పార్టీని అప్పగించాలని నాని సూచించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్లే ఆ మాత్రం సీట్లయినా వచ్చాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

లోకేశ్ ప్రచారం చేస్తే అతనే గెలవలేకపోయాడని.. చంద్రబాబు, లోకేశ్‌ టీడీపీని ముంచేయకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలివ్వాలని నాని సూచించారు. అప్పడే టీడీపీ కనీసం ప్రతిపక్షం లేదా పార్టీగా ఉంటుందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. 

Also Read:70 ఏళ్ల బండి లోకేశ్ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదు: బాబుపై వంశీ తీవ్రవ్యాఖ్యలు

కాగా ఆయన మిత్రుడు, టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీ. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, నారా లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో తాను అడిగింది ఒకటైతే.. టీడీపీ బ్యాచ్ చెప్పేది మరోకొటి అంటూ చురకలు అంటించారు.

1978లో ఇందిరా గాంధీ చంద్రబాబుకు ఏం చూసి టికెట్ ఇచ్చారని వంశీ ప్రశ్నించారు. పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీదైనా పోటీచేస్తానని.. రంగులేసుకునేవారికి రాజకీయాలు ఎందుకని బాబు అనలేదా అంటూ వంశీ ఫైరయ్యారు.

ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలిచిన వెంటనే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టారని వంశీ ప్రశ్నించారు. తాను చేసింది ఎదవ పనైతే.. చంద్రబాబు చేసింది ఎదవన్నర పనా 30 ఏళ్ల కిందట బాబు చేసిన ఈ పనిని ప్రెస్‌మీట్లు పెట్టే బ్యాచ్ ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.

అత్యంత అవినీతి చక్రవర్తి, దోపిడి దొంగ, ఔరంగజేబు, వెన్నుపోటుదారుడు, నీచుడు, నికృష్టుడు, భూమ్మీద ఉండటానికి కూడా పనికిరావంటూ ఎన్టీఆర్ మరణించేముందు వ్యాఖ్యానించారని వంశీ గుర్తుచేశారు.

మోడీని నరకహంతకుడని, ఈ రాష్ట్రంలోకి రానివ్వనని, అరెస్ట్ చేయిస్తానని 2004లో నిప్పులు తొక్కిన చంద్రబాబు.. 2014లో మోడీతో కలిసి తిరిగారని వంశీ మండిపడ్డారు. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలిపేసుకున్నప్పుడు నరేంద్రమోడీ ఇంటి ముందు చంద్రబాబు దీక్ష ఎందుకు చేయరని వల్లభనేని ప్రశ్నించారు.

Also Read:ఓ పప్పు, చుట్టూ బఫూన్లు: లోకేష్‌పై వంశీ తిట్ల వర్షం

తనపై పిచ్చికుక్కలను వదలకుండా బోనులో పెట్టుకోవాలని చంద్రబాబును వంశీ హెచ్చరించారు. తాజా ఎన్నికల్లో తనతో పాటు చాలామందికి టికెట్లు ఇచ్చారని.. వాళ్లంతా గెలిచారా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి నారా లోకేశ్ ఒక గుదిబండ అని... 70 ఏళ్ల బండి ఆ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదని వంశీ సెటైర్లు వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios