ఓ పప్పు, చుట్టూ బఫూన్లు: లోకేష్‌పై వంశీ తిట్ల వర్షం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం: నారా లోకేష్‌కు ఫైరుందా, ఫైర్ మిషన్ ఉందా.. వాడో పప్పు.. వాడి మాదిరిగా నేను అమ్మను, అయ్యను అడ్డం పెట్టుకొని ఎదగలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు.
ఆస్తులను కాపాడుకొనేందుకే తాను పార్టీ మారినట్టుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.
సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. పది జన్మలెత్తినా కూడ జూనియర్ ఎన్టీఆర్‌గా నారా లోకేష్ కాలేడని వంశీ అభిప్రాయపడ్డారు. బఫూన్లు, కుక్క బిస్కెట్లు, బఫూన్‌గాళ్లను పక్కన పెట్టుకొని తనపై విమర్శలు చేస్తున్నారని వల్లభనేని వంశీ చెప్పారు.
చంద్రబాబునాయుడు లేని రోజున లోకేష్‌కు వాడి బతుకు తెలిసి వస్తోందని వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలని లోకేష్, ప్రధానమంత్రి కావాలని చంద్రబాబునాయుడు పళ్లు రాలగొట్టుకొన్నారని వల్లభనేని వంశీ చెప్పారు.నాకు ఎక్కడ ఆస్తులున్నాయో, ఏ ఆస్తులను కాపాడుకొనేందుకు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశానో చెప్పాలని లోకేష్‌ను వల్లభనేని వంశీ ప్రశ్నించారు.
జూనియర్ ఎన్టీఆర్ కు లోకేష్ కు పోలికా...2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా ప్రచారం చేశాడో వంశీ గుర్తు చేశారు.మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు. సీఎం కావాల్సిన లోకేష్ ఎందుకు ఓటమి పాలయ్యాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేష్‌కు భయం, వణుకు, దడ వస్తోందని వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వద్ద జురాసిక్ పార్క్ ఉందన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం ఉంటే తనకు ఉన్న ఆస్తులు ఏమిటి, వాటిని కాపాడుకొనేందుకే చేస్తున్న ప్రయత్నాలను వివరించాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
తప్పు చేసిన వాడు ఎప్పుడైనా ఆ తప్పు తాను చేసినట్టుగా ఒప్పుకొంటాడా అని వంశీ ప్రశ్నించారు. ఆ వెబ్‌సైట్లతో తనకు సంబంధం ఉందని లోకేష్ ఎందుకు ప్రకటిస్తాడని ఆయన ప్రశ్నించారు.
ఈ వార్తలు చదవండి
జూ.ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడెందుకు, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం
బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్.
చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల ఝలక్ : ఏమవుతోంది...?
నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం..