Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?

ఉత్తరాంధ్ర నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Uttarandra Sentiment:Why Y.S. Jagan Mohan Reddy to start Election Campaign From Uttarandra Sentiment lns
Author
First Published Jan 27, 2024, 11:00 AM IST | Last Updated Jan 27, 2024, 11:15 AM IST

విశాఖపట్టణం: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ అధినేత  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.  2019లో  ఉత్తరాంధ్ర సెంటిమెంట్  జగన్ కు  కలిసి వచ్చింది.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ  151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.  దీంతో  ఈ ఏడాది  ఏప్రిల్ మాసంలో జరిగే  అసెంబ్లీ ఎన్నికలకు  జగన్  మరోసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 

also read:అచ్చు సినిమానే: కవలలను విడదీసిన తండ్రి, 19 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్లు

ఉత్తరాంధ్రలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నాడు ప్రారంభించనున్నారు.భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలకు చెందిన  34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీకి చెందిన మూడున్నర నుండి నాలుగు లక్షల మందికి జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.  సిద్దం పేరుతో  ఎన్నికల ప్రచారానికి  జగన్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు.

also red:తెరపైకి మూడు రాజధానులు: అమరావతి ఉద్యమానికి 1500 రోజులు, కారణమిదీ....

రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో   సిద్దం పేరుతో  పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.భీమిలీలో  ఇవాళ తొలి సమావేశం నిర్వహించనున్నారు. 2019 ఎన్నికల్లో కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేసింది. రానున్న ఎన్నికల్లో కూడ  ఒంటరిగానే  పోటీ చేస్తామని  ఆ పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో  తెలుగు దేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 

 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ వ్యూహాలు రచిస్తుంది.  ఈ క్రమంలోనే సర్వే ఫలితాల ఆధారంగా వైఎస్ఆర్‌సీపీ  పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చాలని  నిర్ణయం తీసుకుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని జగన్  భావిస్తున్నారు.ఈ క్రమంలోనే  రాష్ట్రంలో  58 మంది  ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ అభ్యర్థులను జగన్ మార్చారు.  

also read:సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీల మార్పు: వైఎస్ఆర్‌సీపీ ఐదో జాబితాపై కసరత్తు

ఇంకా మరికొందరు అభ్యర్థులను మార్చేందుకు  జగన్  కసరత్తు చేస్తున్నారు. తెలుగు దేశం, జనసేన చేస్తున్న క్యాంపెయిన్ ను తిప్పి కొట్టే వ్యూహంతో  'సిద్దం' వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల రంగంలోకి దిగుతుంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios