పుట్టిన తర్వాత  19 ఏళ్లకు  కవలలు తిరిగి కలుసుకున్నారు. ఈ కవలలు సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా  సీతా ఔర్ గీతా అనే సినిమా  1972లో  బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా తరహాలోనే  జార్జియాలో  ఓ ఘటన చోటు చేసుకుంది.  జార్జియాకు చెందిన  అమిఖ్విటియా, అనోసార్టానియా కవలలు. పుట్టిన తర్వాత  వీరిద్దరూ విడిపోయారు. చిన్నతనంలో  వీరిద్దరూ విడిపోయిన 19 ఏళ్ల తర్వాత ఓ టాలెంట్ షో లో  వీరిద్దరూ  కలుసుకున్నారు. ఈ విషయాన్ని బీబీసీ వెలుగులోకి తీసుకు వచ్చింది.  

బీబీసీ కథనం మేరకు జార్జియాకు చెందిన  అమిఖ్విటియా, అనోసార్టానియా కవలలు.  వీరిద్దరిని వేరు చేసింది వారి తండ్రే.  కవలల తండ్రి వీరిని అమ్మేశారు.కవలలకు జన్మనిచ్చిన అజా షోని  2002లో  ఆరోగ్య సమస్యల కారణంగా  కోమాలోకి వెళ్లారు.  ఆమె భర్త గోచా గఖారియా  ఇద్దరు పిల్లలను వేర్వేరు కుటుంబాలకు విక్రయించారు.అనో టిబిలిసిలో పెరిగింది. అమీ  జుగ్దిడిలో పెరిగింది.  ఇద్దరి గురించి ఒకరికి ఒకరికి తెలియదు.  

తన మాదిరిగానే ఉన్న యువతిని టిక్ టాక్ వీడియోను అనో  చూసింది. టిక్ టాక్ వీడియో చేసిన అమిఖ్విటియా గురించి ఆరా తీశారు. ఒకే రకమైన పోలీకలతో ఉన్న వారు  పరస్పరం ఒకరి గురించి ఒకరు  తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే  వారిద్దరి తల్లీదండ్రులు ఒకరేనని తెలుసుకున్నారు.  రెండేళ్ల క్రితం  వీరిద్దరూ  జార్జియా రాజధాని రుస్తావేలీ వంతెనపై  కలుసుకున్నారు. పుట్టిన తర్వాత  19 ఏళ్లకు వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కలుసుకోవడంతో ఈ కథ సుఖాంతమైంది. అచ్చు సినిమాను తలపించేలా వీరిద్దరి కథ ఉంది.