అమరావతి: విజయవాడలో  దుర్గగుడి ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎంలు శుక్రవారం నాడు ప్రారంభించారు.

రూ. 502 కోట్లతో ఆరు లైన్లతో 2.6 కి.మీ దూరంలో ఈ వంతెనను నిర్మించారు.900 పనిదినాలలో ఆ ఫ్లైఓవర్ నిర్మించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కనకదుర్గ ఫ్లైఓవర్ తో పాటు రాష్ట్రంలోని రూ. 15,592 కోట్ల వ్యంతో 61 కొత్త ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు చేశారు.

ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడారు.. ఏపీ అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. పారిశ్రామికాభివృద్దికి ఏపీలో అనుకూల పరిస్థితులున్నాయని ఆయన చెప్పారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో రోడ్లు అభివృద్ది జరిగినట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

జాతీయ రహదారులు ఏపీలో 2667 కి.మీ పెరిగినట్టుగా నితిన్ గడ్కరీ చెప్పారు.పోర్టుల అభివృద్దికి, పారిశ్రామిక అభివృద్దికి సహకరిస్తామన్నారు.ఎంఎస్ఎంఈలకు చేయూత నివ్వడంతో పాటు పోర్టుల కనెక్టివిటీ కోసం సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.సీఎం జగన్ ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఫ్లైఓవర్ తో విజయవాడ మరింత అభివృద్ధి జరగనుందని ఆయన అభిప్రాయపడ్డారు.బెజవాడ వాసులకు కేంద్రం అందిస్తున్న కానుకగా మంత్రి అభివర్ణించారు. దుర్గగుడిఫ్లైఓవర్ ప్రారంభంతో సామాజిక, ఆర్ధిక ప్రగతి సాధ్యమని ఆయన చెప్పారు. 

also read:విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్:రేపు ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీ పరిధిలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

మోడీ హయాంలో జాతీయ రహదారుల రూపురేఖలే మారిపోయాయని ఆయన గుర్తు చేశారు. తమ రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి కేంద్రం ఎంతో సహకరిస్తుందన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ చొరవను కూడ మరవలేమన్నారు.

ఈ ఫ్లైఓవర్ తో విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు.

తీర ప్రాంతాల కనెక్టివిటీ, ఐదు పోర్టుల అనుసంధానానికి నిధులను కేటాయించాలన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేస్తున్నందున.. విశాఖ నుండి భోగాపురం ఎయిర్ పోర్టుకు  ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

బీచ్ రోడ్డు నుండి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా టేకప్ చేయాలని ఆయన కోరారు.  దేశంలోని పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను విస్తరించాలని