అమరావతి: విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ శుక్రవారం నాడు ప్రారంభంకానుంది.ఈ ఫ్లైఓవర్ పై రాకపోకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిని గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఫ్లైఓవర్ నుప్రారంభించనున్నారు.

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఇవాళ పరిశీలించారు. 

aksi read:ప్రణబ్ ముఖర్జీ మృతి: విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

ఇప్పటికే రెండు దఫాలు ఫ్లైఓవర్ ను ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఒక్కసారి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో  రెండోసారి ఈ కార్యక్రమం వాయిదా పడింది

కరోనా నుండి కేంద్ర మంత్రి గడ్కరీ కోలుకొన్నారు. దీంతో రేపు గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.కనకదుర్గ ఫ్లై ఓవర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. .రూ. 15,592 కోట్లతో అంచనాలతో 61 ప్రాజెక్టుల పనులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.