విజయవాడ: ఈ నెల 4వ తేదీన నిర్వహించాల్సిన విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్  ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఏడు రోజుల పాటు సంతాపదినాలను కేంద్రం ప్రకటించడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు అధికారులు.

గత నెల 10వ తేదీన అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరాడు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆగష్టు 31వ తేదీ సాయంత్రం మరణించాడు. ప్రణబ్ ముఖర్జీ మృతితో కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 31 తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు సంతాప దినాలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 4వ తేదీన  విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని అధికారలుు నిర్ణయించారు. అయితే సంతాప దినాలు కొనసాగుతున్నందున  దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు అధికారులు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఫ్లై ఓవర్ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఫ్లై ఓవర్ ప్రారంభమైతే హైద్రాబాద్ నుండి విజయవాడ నగరంలోకి రావడానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కోసం విజయవాడ వాసులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.