Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దక్కని అపాయింట్‌మెంట్:బాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్


టీడీపీ చీఫ్ చంద్రబాబుకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రెండు రోజుల వరకు ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో బుధవారం నాడు అమిత్ షా బాబుకి ఫోన్ చేశారు.

Union Minister Amit Shah Phoned To Chandrababu Naidu
Author
Guntur, First Published Oct 27, 2021, 4:49 PM IST

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి కేంద్ర హోంశాఖ మంత్రి  amit shah బుధవారం నాడు ఫోన్ చేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న Chandrababuకు అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కలేదు. దీంతో మంగళవారం నాడు సాయంత్రం బాబు ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకొన్నారు.ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో కలవడం సాధ్యం కాలేదని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోని Tdp కార్యాలయాలపై దాడులు,ఇతరత్రా అంశాలను చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షా కు వివరించారు.

also read:బాబుతో తెలంగాణ పోలీసాఫీసర్ కుమ్మక్కు.. అందుకే ఏపీలో దాడులు, కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా: విజయసాయి సంచలనం

రాష్ట్రంలో Ganja, Drugs కు సంబంధించిన అంశాలను చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు నిర్వహించారని ఆయన  చెప్పారు. తమ  పార్టీకి చెందిన నేతలపై దాడులు చేస్తూ తమవారిపైనే కేసులు బనాయిస్తున్నారని  చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.ఈ అంశాలపై రూపొందించిన వినతిపత్రాన్ని పంపుతామని బాబు అమిత్ షా కు తెలిపారు.ఈ విషయాలను వివరించేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించారు. దీంతో బాబుకు అమిత్ షా ను కలవడం సాధ్యం కాలేదు.ఏపీ సీఎం Ys Jagan పై టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi  బూతు వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలతో పాటు ఆ పార్టీ నేతలపై దాడులకు దిగారు.ఈ దాడులను నిరసిస్తూ చంద్రబాబునాయుడు 36 గంటల దీక్షకు దిగాడు. మరో వైపు సీఎంపై బూతు వ్యాఖ్యలు చేసిన పట్టాభి, చంద్రబాబులు క్షమాపణ చెప్పాలని కోరుతూ వైసీపీ రెండు రోజులు జనాగ్రహ దీక్షలకు దిగింది..

టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 356 ఆర్టికల్ ప్రయోగించాలని డిమాండ్ చేశారు.ఇదే విషయమై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు. ఆర్టికల్ 356 కు టీడీపీ వ్యతిరేకం. అయితే ఈ ఆర్టికల్ ను ప్రయోగించాలని తాము కోరుతున్నామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ ఆర్టికల్ ను ప్రయోగించాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని కూడ మీడియాకు చెప్పారు.

తమ పార్టీకి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు కూడ బనాయిస్తోందని కూడ టీడీపీ చీఫ్ చెబుతున్నారు.తమ పార్టీకి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు కూడ బనాయిస్తోందని కూడ టీడీపీ చీఫ్ చెబుతున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నేతలపై కేసులు బనాయించి జైల్లో పెట్టారని చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడ ఈ విషయాలపై చంద్రబాబు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios