వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఇద్దరికీ పడకపోవటమే ప్రధాన కారణం. జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుండి కరణం బలరాం, కందుకూరు నియోజకవర్గం నుండి దివి శివరాం టిడిపికి గుడ్ బై చెప్పటం ఖాయమని సమాచారం. అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్-కరణం వర్గా మధ్య గొడలు అందరికీ తెలిసిందే. వీరి మధ్య వివాదాలను సర్దుబాటు చేయటానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ప్రకాశం జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఇద్దరికీ పడకపోవటమే ప్రధాన కారణం. జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుండి కరణం బలరాం, కందుకూరు నియోజకవర్గం నుండి దివి శివరాం టిడిపికి గుడ్ బై చెప్పటం ఖాయమని సమాచారం. అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్-కరణం వర్గా మధ్య గొడలు అందరికీ తెలిసిందే. వీరి మధ్య వివాదాలను సర్దుబాటు చేయటానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో చేసేదిలేక గొట్టిపాటికే తన మద్దతు ప్రకటించారు చంద్రబాబు.

ఇపుడదే విషయమై కరణం మండిపోతున్నారు. పార్టీ పెట్టినప్పటినుండి టిడిపిలోనే ఉన్న తనను కాదని వైసీపీ నుండి ఏడాది క్రితం వచ్చిన గొట్టిపాటికి సిఎం మద్దతుగా నిలవటాన్ని కరణం జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విషయాన్ని తమ మద్దతుదారలతో మాట్లాడుకున్నారు. దానికితోడు నియోజకవర్గాలు పెరగవని తేలిపోయింది, అద్దంకిలో పోటీ చేసే అవకాశం లేక, నియోజకవర్గాల పెంపు కుదరక, గొట్టిపాటిని తట్టుకోలేక చివరకు టిడిపికి గుడ్ బై చెప్పటమే మేలని మద్దతుదారులు కూడా తేల్చిచెప్పటంతో కరణం వెంటనే జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వెళ్ళారట.

కరణం వర్గాన్ని తీసుకోవటానికి జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కరణం కొడుకు కరణం వెంకటేష్ కు అద్దంకిలో టిక్కెట్టు ఇవ్వటానికి కూడా సుముఖంగానే ఉన్నారట. అయితే, ముందు కరణం తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయాలన్నది షరతు. అయితే, వైసీపీలో కరణం ఏమేరకు ఇమడగలరనే విషయమై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా కరణం దారిలోనే కందుకూరు మాజీ ఎంఎల్ఏ దివి శివరాం కూడా నడవటానికి సిద్ధపడ్డారు. అద్దంకిలోని సమస్యే కందుకూరులో దివికి కూడా ఎదురవుతోంది. దాంతో ఇద్దరూ మాట్లాడుకుని త్వరలో టిడిపిని వదిలేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నంద్యాల ఉపఎన్నిక తర్వాతే వీరిద్దరి విషయాన్ని జగన్ ఫైనల్ చేయనున్నారు.