తిరుమల: తిరుమల వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు టోల్ మోత మోగనుంది. టోల్ గేట్ వద్ద ఛార్జీలను పెంచుతూ టీటీడీ శుక్రవారంనాడు నిర్ణయం తీసుకొంది.

ప్రస్తుతం రూ. 15 నుండి రూ. 100 వరకు టోల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే వాహనాల టోల్ చార్జీలను రూ. 50 నుండి రూ. 200లకు చెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకొంది.ప్రతి రోజూ  తిరుమలకు 7 నుండి 8 వేల మంది వాహనాలు వస్తాయి.

also read:ఆస్తులపై ఐదు రోజుల్లో అఫిడవిట్ ఇవ్వండి: టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశం

అలిపిరి టోల్ ‌గేట్ వద్ద స్వంత కారుకు రూ. 15 చార్జీ వసూలు చేస్తారు. టాక్సీ కారుకు రూ. 25 ఛార్జీ చేస్తారు. స్వంత జీపునకు రూ. 30, సుమో, టెంపో ట్రాక్స్ లాంటి వాహనాలకు  రూ. 50  ఛార్జీ చేస్తారు.హెచ్‌బీ మినీ లారీకి రూ. 50,  డ్రైవర్ సహా 12 మంది ప్రయాణించే వ్యాన్ లకు రూ. 60 లు, ఏపీటీడీసీ వాహనాలకు రూ. 100లు, ద్విచక్ర వాహనాలకు రూ. 2 వసూలు చేస్తున్నారు.

అయితే ఈ ఛార్జీలను పెంచుతూ టీటీడీ ఇవాళ నిర్ణయం తీసుకొంది.