ఆస్తులపై ఐదు రోజుల్లో అఫిడవిట్ ఇవ్వండి: టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశం

 టీటీడీ ఆస్తుులపై ఏపీ హైకోర్టు గురువారం నాడు కీలక  ఆదేశాలు ఇచ్చింది.టీటీడీ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది.

AP High court orders to file affidavite on assets of TTD lns

అమరావతి: టీటీడీ ఆస్తుులపై ఏపీ హైకోర్టు గురువారం నాడు కీలక  ఆదేశాలు ఇచ్చింది.టీటీడీ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది.ఐదు రోజుల్లో ఈ వివరాలన్నీ ఇవ్వాలని టీటీడీకీ హైకోర్టు ఆదేశించింది.టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ తీసుకొన్న చర్యలపై అఫిడవిట్ రూపంలో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

టీటీడీకి చెందిన ఆస్తులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీకి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయనే విషయమై  శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సంస్థలు, సంఘాలు, పార్టీలు గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

టీటీడీకి  చెందిన ఆస్తులపై అఫిడవిట్ రూపంలో వివరాలను అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై టీటీడీ ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. 
తదుపరి విచారణ ఈ ఏడాది మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

కరోనా కారణంగా గత ఏడాది నుండి టీటీడీకి ఆదాయం తగ్గింది. కరోనా లేకపోతే ప్రతి రోజూ టీటీడీకి కోట్లాది రూపాయాల ఆదాయం వచ్చేది. కరోనా కారణంగా ఆదాయం తగ్గింది. ఇటీవల కాలంలో టీటీడీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios