ఓ ఏనుగు రైతు పట్ల దారుణంగా ప్రవర్తించింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆయనపై తీవ్రంగా దాడి చేసింది. కాలితో తొక్కింది. దీంతో ఆ రైతు తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.
ఆ భార్యాభర్తలిద్దరూ పొలంలో పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దారిలో ఉన్న ఓ ఏనుగు హఠాత్తుగా వారి మీదకి దూసుకొచ్చింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే ఇద్దరిపై దాడికి దిగింది. భార్య ఎలాగోలా తప్పించుకొని ఊర్లోకి వెళ్లింది. అందరికీ విషయం చెప్పింది. కానీ వారందరూ తిరిగొచ్చేసరికే ఆయన చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది.
మనీలాండరింగ్ కేసు: ఈ నెల 24న హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు
వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లె గ్రామంలో మార్కొండయ్య(52)-అరుణమ్మ అనే రైతు దంపతులు నివసిస్తున్నారు. సొంత గ్రామంలోనే వారిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బాటకు సమీపంలో ఓ ఏనుగు నిలబడి ఉంది.
త్వరలో ఉల్లి ధరలు పెరిగే ఛాన్స్.. కేంద్రం కీలక నిర్ణయం , ఎగుమతులపై భారీగా సుంకం
దీనిని చూసుకోకుండా ఆ రైతులిద్దరూ దాని దగ్గరగా వెళ్లారు. ఆ జగరాజు ఎందుకు ఆగ్రహంగా ఉందో తెలియదు గానీ.. హఠాత్తుగా వారిపై దాడికి దిగింది. ఈ క్రమంలో భర్త మార్కొండయ్య కిందపడిపోయాడు. దీంతో ఆ ఏనుగు ఆయనను కాలితో తొక్కడం ప్రారంభించింది. అరుణమ్మ ఆ ఏనుగు బారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు ఏనుగుదాడి విషయం చెప్పింది. దీంతో వారు కూడా వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అక్కడికి చేరుకునేలోపే మార్కొండయ్య గాయాలతో చనిపోయారు.
లడఖ్‌లో లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు దుర్మరణం
ఏనుగుదాడి విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశారు. కాగా.. పెద్దపంజాణి మండలంలో ఇటీవల కాలంలో ఏనుగు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు.
