Asianet News TeluguAsianet News Telugu

టాప్ స్టోరీస్ : ఏపీ, తెలంగాణల్లో ఉద్యోగ హామీలు.. ఫిబ్రవరి 1న గ్రూప్ వన్ నోటిఫికేషన్, ఏపీలో 8.080 మందికి ఉపాధి

శనివారం విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉంది. సామాజిక భూహక్కులతో వేలాదిమంది లబ్ధిపొందనున్నారు. ఛత్లీస్ గఢ్ ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్ మృతి లాంటి ప్రముఖ వార్తల సమాహారం ఈ టాప్ స్టోరీస్...

Top stories : Guarantees of jobs in AP, Telangana, Group one notification in Telangana, employment for 8,080 people in AP  - bsb
Author
First Published Nov 18, 2023, 7:35 AM IST

ఫిబ్రవరి 1న గ్రూప్ వన్ నోటిఫికేషన్

కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో శుక్రవారం నాడు తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ జాతి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 414 హామీలతో కూడిన 42 పేజీల ఈ మేనిఫెస్టోలో 37 రంగాలకు న్యాయం జరిగేలా అంశాలను పొందుపరిచారు.  మొదటి పేజీలో 10 హామీలతో సుపరిపాలన ఎలా తెస్తారో వివరించారు. ఇక ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే విడుదల చేసే వివిధ కేటగిరీల పోస్టుల నోటిఫికేషన్లు,  వాటి విడుదల చేసే తేదీలను ఈ 42 పేజీల్లో వెల్లడించారు.రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేసేలా క్యాలెండర్ ను అందులో పొందుపరిచింది. తొలిమంత్రివర్గ సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపింది. దీన్నే బ్యానర్ ఐటమ్ గా ‘ఫిబ్రవరి 1న గ్రూప్ వన్ నోటిఫికేషన్’ పేరుతో ఈనాడు ప్రచురించింది. 

Telangana Congress manifesto: ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు

34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు

నా ఎస్టీ.. నా ఎస్సీ.. నా బీసీ నా మైనారిటీ పదాలకు అర్థం చెబుతూ.. 34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు.. అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల మీద బ్యానర్ ఐటమ్ గా ఓ వార్తను ప్రచురించింది. సామాజిక భూహక్కులు చరిత్రను తిరగరాస్తున్నాయని.. నూజివీడు బహిరంగ సభలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ప్రచురించింది. ఈ సభలో జగన్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా భూములను అనుభవిస్తున్న వారిని చట్టబద్ధంగా హక్కుదారులు చేశామని ఇది చరిత్రలో గొప్పగా నిలిచిపోయే రోజు అని అన్నారు. ఈ సభలో 42,307 మందికి కొత్తగా 46,463.82 ఎకరాల డికెటి పట్టాలను పంపిణీ చేపట్టామన్నారు. 1563 గ్రామాల్లో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాలు కేటాయించామన్నారు. నూజివీడు బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పూర్తి ప్రసంగ పాఠాన్ని ప్రచురించారు.

పూర్తి కథనం..

మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో  ముగిసిన పోలింగ్

శుక్రవారం నాడు మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు, చత్తీస్గఢ్లో  70 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్లో 76% పోలింగ్ జరగగా. ఛత్తీస్గడ్ లో 70.59% పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటలకల్లా పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ చెదురుమదురుగా అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ పెద్దగా సమస్యలు ఏర్పడలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పేల్చిన బాంబులతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. ఈ వార్తను  సాక్షి ప్రచురించింది. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

చంద్రబాబు కోసమేనా.. కరువు అరుపులు.. 

ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరువు తాండవిస్తుందంటూ ఈనాడు రాసిన కథనాలను సాక్షి తిప్పి కొట్టింది. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కరువు రాతలు రాస్తుందంటూ చెప్పుకొచ్చింది. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే కరువును గుర్తిస్తున్నామని.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవి పాటించాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. 130 కరువు మండలాలను సీజన్ ముగియకముందే ప్రకటించినట్లుగా తెలిపింది. కరువు, జగన్ కవల పిల్లలు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై  మండిపడింది. 


ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన యూనిట్..

ఓ ఆసక్తికరమైన వార్తను సాక్షి మొదటి పేజీలో ప్రచురించింది.  ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహన యూనిట్ను ప్రారంభిస్తున్నట్లుగా ఆ వార్త కథనం చెబుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా  సమాచారం. ఈ వాహన యూనిట్ ను జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పెప్పర్ మోషన్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిపోయిందని పుంగనూరులో యూనిట్ ప్రారంభించబోతున్నట్లుగా తెలిపింది. దీనికోసం 4640 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలిపింది. ఈ 8.080  మందికి ఉపాధి కలుగుతుందని.. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ప్రచురించింది.

స్కిల్ స్కామ్ కేసులో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు దారి తీసిన స్కిల్ స్కాంకు సంబంధించి ఓ వార్తను సాక్షి ‘బోగస్ ఇన్వాయిస్ లతో స్కిల్ నిధులు స్వాహా’ అనే పేరుతో ప్రచురించింది. ఈ స్కామ్ లో చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తానే ప్రధాన సూత్రధారి అని తెలిపింది. చంద్రబాబు చెబితేనే వాటిని ఇచ్చానని.. అప్రూవర్ గా మారి పూర్తి కుట్రను వెల్లడిస్తానని అనుమతించాలంటూ ఏసీఐఎండి చంద్రకాంత్ షా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో.. స్కిల్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది.  దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ప్రచురించింది సాక్షి పత్రిక. 

ధరణిలో భారీ స్కాం

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ధరణి పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి తెలంగాణ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ దేవదేఖరి ఆరోపించారు. ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి ధరణిలో భారీ స్కాం పేరుతో ప్రముఖంగా ప్రచురించింది. ధరణి కారణంగా లక్షలాది మంది రైతులు తమ విలువైన భూములను కోల్పోయారని.. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం కంటే ఇది చాలా పెద్దదని ఆయన మండిపడ్డారు.  ప్రజాహితం కోసమే చేస్తున్నామంటూ చెబుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అతిపెద్ద మోసం ఇది అని చెప్పుకొచ్చారు. శనివారం నాడు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయనుంది. దీనిలో పొందుపరిచిన అంశాలతో  ఓ వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసింది.

తెలంగాణ‌ బీజేపీ మేనిఫెస్టో
8
టూరిజం  ఎండీ మనోహర్ పై  సస్పెన్షన్ వేటు

తెలంగాణ  టూరిజం ఎండి మనోహర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా ఈసీ వెల్లడించింది. టూరిజం ఎండిగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమలకు వెళ్లినందుకు.. ఇలా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకే అతని నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. దీంతో ఎండి మనోహర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది.హైదరాబాద్ హైటెక్ హంగులు

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్  సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ప్రచారానికి విపరీతంగా వాడుకుంటుంది. ఈ పదేళ్లలో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో జరిగిన అభివృద్ధిని చెబుతున్నారు. ఆధునికతకు ఐటీ కారిడార్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆకాశాన్ని అంటే బహుళ అంతస్తుల అద్దాల మేడలు హైదరాబాద్ రూపురేఖలను ఒక్కసారిగా మార్చేశాయి అంటూ ‘హైదరాబాద్ హైటెక్ హంగుల’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన పూర్తి కథనాన్ని ప్రచురించింది.  హైటెక్ రోడ్లు, భారీ బహుళ అంతస్తుల భవనాలు, కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్లు ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి.  ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్ళ ముందు చూపిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో క్లిక్ మనిపిస్తూ.. ఆ వీడియోలను.. ట్విట్టర్,  ఫేస్బుక్, వాట్సప్ లలో  వీడియోలు, ఫోటోల రూపంలో షేర్ చేస్తున్నారు.

10 
కాంగ్రెస్ వందల మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంది.. కేటీఆర్ 

నరహంతక కాంగ్రెస్ పేరుతో మరో వార్తను బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది నమస్తే తెలంగాణ. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ వందల మంది బిడ్డలను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు కేటీఆర్. చిదంబరం ఇప్పుడు వచ్చి సారీ చెబుతున్నారని… తెలంగాణను ప్రకటించినట్లే ప్రకటించి.. తరువాత వెనక్కి తీసుకోవడంతో  వందల మంది  ఆత్మహత్యలకు  పాల్పడ్డారని  దుయ్యబట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios