BJP: తెలంగాణ‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా.. హామీలు ఇవే..

BJP Manifesto: ప్ర‌స్తుత మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మేనిఫెస్టో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌నుంద‌ని స‌మాచారం. మేనిఫెస్టో లో ధరణి స్థానంలో మీ భూమి యాప్ తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డం వంటివి ఉన్నాయి.
 

Amit Shah to release Telangana BJP manifesto on November 18 These are the assurances RMA

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అన్ని రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నిక‌ల మేనిఫెస్టోల‌ను విడుద‌ల చేసి.. ప్ర‌జ‌ల‌ల్లోకి వెళ్తున్నాయి. ఇదే క్ర‌మంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కూడా ఎన్నిక‌ల మేనిఫెస్టోతో ప్ర‌జ‌ల ముందుకు వెళ్ల‌నుంది. తెలంగాణ బీజేపీ శ‌నివారం ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో సుపరిపాలన, పేదల సంక్షేమం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనుంద‌నీ, దీనిని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా విడుద‌ల చేస్తార‌ని తెలంగాణ బీజేపీ తెలిపింది. ఇక ప్ర‌స్తుత మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌నుంద‌ని స‌మాచారం. మేనిఫెస్టో లో ధరణి స్థానంలో మీ భూమి యాప్ తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డం వంటివి ఉన్నాయి.

మీడియా రిపోర్టుల ప్ర‌కారం బీజేపీ మేనిఫెస్టోలో అంద‌రికీ విద్యా, వైద్యం, వ‌రి క్వింటాలు ధ‌ర రూ.3100 పెంచ‌డం, ఆయుష్మాన్ భార‌త్ కింద 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం, అంద‌రికీ బీమా అందించ‌డం, రూ.500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, వ్య‌వ‌సాయ కార్మికుల‌కు ఏడాదికి రూ.20 ఆర్థిక సాయం అందించ‌డం వంటి హామీలు ఉండ‌నున్నాయ‌ని తెలుస్తోంది. వీటితో పాటు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద అర్హులైన ప్ర‌తి పేద వ్య‌క్తి ఇల్లు క‌ట్టించ‌డం, పంట‌ల బీమా ప‌థ‌కం అమ‌లు చేయ‌డం వంటివి ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం.

ఇక యూపీఎస్సీ మాదిరిగా టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్, ఆరు నెల‌ల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డం వంటివి ఉన్నాయ‌ని స‌మాచారం. అలాగే,  వివాహితుల‌కు సంవ‌త్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించ‌డం, 14. ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయ‌డం, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్‌లు,  తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయ‌డం, ఐదేళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి వంటి హామీల‌ను తెలంగాణ బీజేపీ త‌న మేనిఫెస్టోలో చేర్చింద‌ని స‌మాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios