విశాఖపట్నం: ఇప్పటికే వరుస ఐటీ దాడులతో ఏపీలో హల్ చల్ చేసిన ఐటీ శాఖ మరోసారి దాడులు చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈసారి విశాఖ టార్గెట్‌గా ఐటీ మరోసారి రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం అమరావతి, హైదరాబాద్ వంటి ప్రాంతాలతోపాటు పలు జిల్లాలో దాడులు చేసి రాజకీయ దుమారం రేపిన ఐటీ ఈసారి విశాఖపై కన్నేసినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా విశాఖపట్నంకు భారీ సంఖ్యలో ఐటీ శాఖ ఉన్నతాధికారులు చేరుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం చేరుకున్న ఐటీ శాఖ ఉన్నతాధికారులు నగరంలో పలు హోటళ్ళలలో బస చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరుల నుంచి వివిధ మార్గాల ద్వారా ఐటీ శాఖ అధికారులు సాయంత్రం 5గంటలకు విశాఖ చేరుకున్నారు.

ఐటీ శాఖ అధికారులు భారీ సంఖ్యలో విశాఖపట్నం చేరుకున్నారన్న విషయం ప్రచారం కావడంతో రాజకీయ నేతలు, వ్యాపార వేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ దాడుల నేపథ్యంలో వీరి మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఐటీ దాడులు.. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఇంట్లో సోదాలు