Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీ రాష్ట్రంలో ఓకేసారి ఐటీ దాడులను ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు సీరియస్‌గా పరిగణించారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు పోలీసు రక్షణను ఉపసంహరించుకొనే విషయమై  ఏపీ సర్కార్ యోచిస్తోంది.

Ap government plans to withdraw protection to income tax officers
Author
Amaravathi, First Published Oct 5, 2018, 4:48 PM IST


అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఓకేసారి ఐటీ దాడులను ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు సీరియస్‌గా పరిగణించారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు పోలీసు రక్షణను ఉపసంహరించుకొనే విషయమై  ఏపీ సర్కార్ యోచిస్తోంది.ఈ విషయమై ఏ రకమైన చర్యలు తీసుకోనే  అవకాశం ఉందో పరిశీలించాలని చంద్రబాబునాయుడు అధికారులను  ఆదేశించారు. .

అవసరమైతే ఈ విషయమై న్యాయం పోరాటానికి కూడ సిద్దం కావాల్సిన అవసరం ఉందని  బాబు అభిప్రాయపడ్డారు.శుక్రవారం నాడు అమరావతిలో ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన  కేబినేటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఒకేసారి పెద్ద ఎత్తున ఐటీ సోదాలు నిర్వహించడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మూకుమ్మడిగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్రంపై దాడిగా బాబు అభిప్రాయపడ్డారు. కేబినేట్ సమావేశంలో ఈ విషయమై చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

రాజకీయ కుట్ర కోణంతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని  ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని  బాబు అభిప్రాయపడ్డారు.

ఐటీ దాడుల వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఇదే రకంగా స్కెచ్ వేస్తున్నారని  కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. మూకుమ్మడిగా ఐటీ దాడులు జరపడం రాష్ట్రప్రభుత్వానికి మాయని మచ్చగా ఆయన  అభిప్రాయపడ్డారు. 

కేంద్రం, రాష్ట్రం సంబంధాలు దెబ్బతినడంపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయాన్ని కూడ పరిశీలించనున్నట్టు  చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉంటుందని చంద్రబాబునాయుడు కేబినేట్ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. 

సంబంధత వార్తలు

ఏపీలో ఐటీ దాడులపై చంద్రబాబు చర్చలు: ఏం చేద్దాం?

ఏపీలో తమిళనాడు సీన్ రిపీట్ అవుతోంది.. మంత్రి నారాయణ

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

 

Follow Us:
Download App:
  • android
  • ios