నేడు ఏపీ ఇంటర్ మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు ఇంటర్ పరీక్షలు జరిగాయి. 

స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడు విడుద‌ల అవుతున్నాయి. ఈ విష‌యాన్ని బోర్డ్ ఆఫ్ ఇంట‌ర్ మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ ఆంధ్రప్రదేశ్ (BIE AP) అధికారికంగా వెల్ల‌డించింది. ఏ స‌మ‌యంలో ఫ‌లితాలు విడుద‌ల అవుతాయో వంటి పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. 

ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌.. పంజాబ్ లో ఉన్న స‌మ‌యంలో ఒక్క సారిగా...

ఇంట‌ర్ మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు బుధ‌వారం (జూన్ 22, 2022) మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో రిలీజ్ అవుతాయి. స్డూడెంట్ల‌కు త‌మ ఫ‌లితాల‌ను ఆన్ లైన్ ద్వారా ఇంట‌ర్ మీడియ‌ట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.inలో చెక్ చేసుకోవ‌చ్చు. 

atmakur bypoll: ముగిసిన ప్ర‌చారం... ఎల్లుండి పోలింగ్‌, లక్ష మెజార్టీ ఖాయమంటోన్న వైసీపీ

ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే ఇంటర్ మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్, సెకండ్ ఇయ‌ర్ ఫలితాల‌ను మధ్యాహ్నం 12:30 గంటల స‌మ‌యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. Manabadi (మ‌న‌బ‌డి) ద్వారా కూడా విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.

శ్రీకాకుళం: జనంపై దాడి చేసిన ఎలుగుబంటి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంటర్మీడియట్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. అయితే ఫ‌లితాలు దాదాపు జూన్ 25వ తేదీ వ‌ర‌కు వ‌స్తాయ‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. కానీ అనుకున్న‌దానికంటే మూడు రోజుల ముందుగానే ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్నారు.