ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంజాబ్ లో ఉన్న సమయంలో ఒక్క సారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అక్కడే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు నిర్ధారించారు. 

ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక్క సారిగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. పంజాబ్ లో ఉన్న స‌మ‌యంలో ఒక్క సారిగా అనారోగ్యానికి గుర‌య్యారు. వంశీ పోయిన సంవ‌త్స‌రం హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)లో సీటు సాధించారు. అందులో భాగంగా ఆయ‌న Advanced Management Program in Public Policy (AMPPP) కోర్సు చేస్తున్నారు. 

Andhra Pradesh Crime News: క‌న్నతల్లి గొంతుకోసి చంపిన దుర్మార్గుడి అరెస్టు

ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త సోమ‌వారం నుంచి పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని మొహాలీ (Mohali)లో ఉన్న క్యాంప‌స్ లో జ‌రుగుతున్న క్లాసెస్ కు హాజ‌రవుతున్నారు. అయితే మంగ‌ళ‌వారం కూడా ఆయ‌న క్లాస్ కు హాజ‌ర‌య్యారు. కానీ ఒక్క సారిగా ఆయ‌నకు లెఫ్ట్ హ్యాండ్ లాగిన‌ట్టు అనిపించింది. దీంతో వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యారు. అక్క‌డ డాక్ట‌ర్లు ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం అక్క‌డే ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆరోగ్యం బాగానే ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఎవ‌రూ ఆందోళ‌నకు గుర‌వ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. మ‌రో రెండు రోజుల వ‌ర‌కు ఆయ‌న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యే అవ‌కాశం ఉంద‌ని డాక‌ర్లు ఫ్యామిలీ మెంబ‌ర్ల‌కు తెలియ‌జేశారు.