తిరుపతి లోకసభ ఉప ఎన్నిక ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పెద్ద సవాల్ నే విసరనుంది. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని జగన్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీకి ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి.
తిరుపతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నిక వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పెద్ద సవాల్ విసరనుంది. ఇప్పటికే గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా ఆయన తిరుపతి లోక్‍సభ సభ్యుడు మాజీ మంత్రి బి.దుర్గాప్రసాదరావు మరణించటంతో ఉప ఎన్నిక జరుగనుంది.
తిరుపతి లోకసభ నియోజకవర్గ పరిదిలోని ఏడుగురు ఎమ్మెల్యేలలో ఎక్కువ మందిపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రేషన్ కార్డులను ఏరివేయటం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు.అమరావతి రాజధానిని విశాఖ నగరానికి తరలించటంపై తిరుపతి లోక్‍సభ నియోజకవర్గ పరిదిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల మెజార్టీ ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తమయితే.. పరిస్థితి జగన్ కు ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు..
Also Read: తిరుపతి లోకసభ ఉప ఎన్నిక: వైఎస్ జగన్ వర్సెస్ పవన్ కల్యాణ్
ఏడుగురు ఎమ్మెల్యేలలో ఒకరిద్దరిపై మినహా మిగతా ఎమ్మెల్యేలందరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్‍కు కూడా తెలుసు. 2019 ఎన్నికలలో 2లక్షల 25వేల మెజార్టీతో జగన్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఒకవేళ చావు తప్పి కన్నులొట్టబోయి అభ్యర్ధి విజయం సాధించినా.. ఎన్నికలలో అభ్యర్ధి ఓడిపోయినా.. తన ప్రభుత్వంపై మెజార్టీ ఓటర్లులో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని జగన్ రెడ్డికి అనుభవంతో తెలిసి వస్తుందంటున్నారు
మరణించిన ఎంపీ దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా.. మరొకరికి ఇవ్వటంతో.. ఆ ప్రభావం ఓటర్లపై పడితే పరిస్థితి ఏమిటినేది ప్రశ్న. తిరుపతి లోక్‍సభ పరిదిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉండగా.. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి.
Also Read: ఎన్టీఆర్, చిరంజీవిల సెంటిమెంట్: పవన్ కల్యాణ్ చేసిన తప్పు అదేనా?.
శ్రీ కాళహస్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తులపై నెల్లూరు జిల్లానేతలు, కార్యకర్తలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి నుంచి పోటీ చేయనున్నారు. బిజెపి కూడా తమ అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ జనసేన మద్దతు తమకు కలిసి వస్తుందని బిజెపి నాయకులు అంటున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 13, 2020, 12:00 PM IST