హైదరాబాద్: ఏపి సీడ్స్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్, కర్నూల్ జిల్లాకు చెందిన కీలక నాయకుడు  ఏవి సుబ్బారెడ్డి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు చేదించారు.హైదరాబాద్ లో ఆయనను హతమార్చేందుకు  ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రను భగ్నం చేసిన అనంతరం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

ఈ హత్య కుట్రపై డిసిపి మాట్లాడుతూ... హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న ఏవి సుబ్బారెడ్డి అంతమొందించడానికి ముగ్గురు ఒప్పందం కుదుర్చకున్నారని తెలిపారు. ఆయన హత్యకు రూ.50లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. 

కరోనా కట్టడికి ఆ రాష్ట్రాన్ని ఫాలో అవ్వండి: జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

ముందుగా నిందితుల్లో ఒకడయిన సంజీవ్ రెడ్డిగా హైదరబాద్  కు వచ్చి సుబ్బారెడ్డి ఇంటివద్ద రెండుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 3 గంటలకు ఆయనను చంపాలని ప్రయత్నించగా పెట్రోలింగ్ వెహికిల్ అటువైపు రావడంతో భయపడి అతడు పారిపోయాడని అన్నారు. దీంతో  భయపడిపోయిన అతడు కడపకు వెళ్లినట్లు వెల్లడించారు.

అక్కడి నుండి మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ కు వచ్చి మరోసారి ఇవాళ హత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరి కదలికలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్యకు సంబంధించిన కుట్రను బయటపెట్టారని వెల్లడించారు. ముగ్గురు నిందితుల నుండి రూ.3.20 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 

read more  ఈసీ రమేష్ కుమార్ పవర్స్ కట్: వైఎస్ జగన్ వ్యూహం ఇదీ...

పట్టుబడిని నిందితుల్లో ఒకరు సూడో నక్సలైట్ గా పోలీసులు గుర్తించారు.సుబ్బారెడ్డి హత్యకోసం వీరికి డీల్ ఇచ్చారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కుట్ర వెనక ఎవరున్నది తేల్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.