Asianet News TeluguAsianet News Telugu

సీఆర్డీఎ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ హై పవర్ కమిటీ నివేదికకకు సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

Andhra pradesh Cabinet approves High power committee redport
Author
Amaravathi, First Published Jan 20, 2020, 10:20 AM IST

హైవపర్ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. 


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సోమవారం నాడు అమరావతిలో జరిగింది. అసెంబ్లీ సమావేశానికి ముందే కేబినెట్ సమావేశం జరిగింది.  సీఆర్‌డీఏ చట్ట ఉపసంహరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. రాజధాని రైతులకు ప్రస్తుతం పదేళ్ల పాటు ఇస్తున్న కౌలును 15 ఏళ్ల పాటు కొనసాగించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకొంది. 

రైతు భరోసా కేంద్రాలకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్  ఆమోదించింది. విశాఖలో సచివాలయం,హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు విషయానికి కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also red: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం.. ఎజెండాపై గోప్యత

ఏడాదిలో మూడు దఫాలు అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పులివెందుల అర్బన్ అధారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాజధాని రచ్చ: ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

అమరావతిలో భూముల సేకరణలో చంద్రబాబునాయుడు సర్కార్  ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై లోకాయుక్తతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios