Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రచ్చ: ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్

ఛలో అసెంబ్లీని పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజీ.పై వాహనాలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. 

Police impose traffic restrictions at Prakasam Barrage in vijayawada
Author
Amaravathi, First Published Jan 20, 2020, 8:28 AM IST


అమరావతి: ఛలో అసెంబ్లీకి అమరావతి పరిరక్షణ సమితి, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో  ప్రకాశం బ్యారేజీపై  సోమవారం నాడు రాకపోకలను నిషేధించారు. సోమవారం నాడు ఉదయం నుండి రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

సోమవారం నుండి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.  ఈ సమావేశాల్లో  మూడు రాజధానుల విషయమై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టనుంది. 

Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితితో పాటు పలు విపక్షాలు పిలపునిచ్చాయి. దీంతో అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీపై ఇతర వాహనాలకు అనుమతిని నిరాకరించారు.

Also read:బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు ఏమన్నారంటే....

అసెంబ్లీ,సచివాలయానికి వెళ్లే అధికారుల వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. సాధారణ వాహనాలకు ప్రకాశం బ్యారేజీపై   రాకపోకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. సాధారణ వాహనదారులు ప్రకాశం బ్యారేజీ నుండి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు సూచించారు.

also read:రాజధాని రచ్చ: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్

సచివాలయం, అసెంబ్లీ వద్ద అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం వైఎస్ జగన్ ను కూడ ప్రత్యామ్నాయ మార్గంలో అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు పోలీసులు ఈ రూట్ లో ట్రయల్ నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios