కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు పార్టీ టిక్కెట్ కేటాయిస్తుందో లేదో అనే ఆందోళన చెందుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ తమ ప్రాంతంలో పర్యటిస్తూ సీఎం ను విమర్శిస్తున్నా.. జనసేన అధినేతపై వారు ఎలాంటి కామెంట్ చేయలేదని తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో కొందరు ఎమ్మెల్యే అభద్రతా భావంతో ఉన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదురించడంలో పలువురు ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహిరిస్తుండటం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను కొనసాగిస్తూ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. కానీ విచిత్రంగా అక్కడి వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, పెద్దాపురం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి దావులూరి దొరబాబు మౌనం పాటిస్తున్నారు. పవన్ కల్యాణ్ పై తిరిగి ఎలాంటి కామెంటూ చేయడం లేదు.
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం.. పోలీసుకు గాయాలు
ప్రత్తిపాడుకు చెందిన పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురంకు చెందిన పెండెం దొరబాబు, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముమ్మిడివరంకు చెందిన పొన్నాడ సతీష్, పి.గన్నవరంకు చెందిన కొండేటి చిట్టిబాబు, రాజోలుకు చెందిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో వరప్రసాద్ జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. తరువాత ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు.
తాజా పరిణామాలను పరిశీలిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నాయకులు తమకు సీట్లు దక్కవనే ఆందోళనతో, అభద్రతా భావంతో ఉన్నారని వైసీపీ వర్గాలు తెలిపాయని ‘డెక్కన్ క్రానికల్’ కథనం పేర్కొంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను ప్రారంభించారు. కానీ ఈ సమయంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ పవన్ కల్యాణ్ పై ఎలాంటి విమర్శలూ చేయలేదు.
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి.. సర్పంచ్ నుంచి రాజ్యసభ వరకు సాగిన రాజకీయ ప్రస్థానం..
అధికార పార్టీలో ప్రసాద్ కు పలుకుబడి తక్కువగా ఉండడంతో ఆయన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. రౌతులపూడి ఎంపీపీ జి.రాజ్యలక్ష్మి, ప్రత్తిపాడు జడ్పీటీసీ బెహర రాజరాజేశ్వరి, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి, సత్యనారాయణమూర్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు జమీల్ తదితరులు బహిరంగంగానే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే జోక్యం కారణంగా ప్రొటోకాల్ విషయాల్లో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ధన లక్ష్మి కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అసమ్మతి నేతలకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. పూర్ణచంద్రప్రసాద్ ను మళ్లీ ఎమ్మెల్యే కానివ్వబోమని ఎమ్మెల్యేను హెచ్చరించారు. అసమ్మతివాదులు ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పవన్ కల్యాన్ పై విమర్శలు చేయలేదు. కాకినాడ ఎంపీ వంగా గీతకు వైసీపీ టికెట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో దొరబాబుకు అభద్రతా భావం ఏర్పడిందని తెలుస్తోంది.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా పవన్ కల్యాణ్ పర్యటనపై మౌనం వహించారు. ఆయన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గడప-గడపకు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో వరదల బీభత్సం.. ఆరుగురు మృతి, 124 రోడ్లు ధ్వంసం.. 300కు పైగా మూగ జీవాల మృత్యువాత
అయితే వరప్రసాద్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డిలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కానీ వరప్రసాద్ మాత్రం పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జనసేన నేతలు కూడా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. రవాణా శాఖ మంత్రి పినీపే విశ్వరూప్ పై కూడా ఇలాంటి ఊహాగానాలు చెలరేగాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వీ కృష్ణ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, అధికార పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. కానీ విశ్వరూప్ మాత్రం పవన్ కల్యాన్ మొత్తం 175 సీట్లు లేదా కనీసం 100 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలను వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.