సర్పంచ్ నుంచి రాజ్యసభ ఎంపీ వరకు సేవలు అందించిన సోలిపేట రామచంద్రారెడ్డి ఇక లేరు. ఆయన తన 92 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు నేటి సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. 

రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి నేటి ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్ లో చనిపోయారు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన ఆయన ప్రస్తుత వయస్సు 92 సంవత్సరాలు. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం.. పోలీసుకు గాయాలు

హైదరాబాద్ సిటీ కాలేజీ నుంచి ఆయన పట్టభద్రుడయ్యారు. అనంతరం పూర్తి కాలం పాటు రాజకీయాల్లోనే ఉన్నారు. తన స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా సేవలదించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అనంతరం దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. తరువాత ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. అనంతరందొమ్మాట నుంచి శాసనసభ నియోజకర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ప్రధాని మోడీకి సవాల్ విసిరేందుకు పాట్నాలో 'వాగ్నర్ గ్రూప్' ఏకమైంది : ప్రతిపక్షాల సమావేశంపై సామ్నా వింత పోలిక

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం సభ్యుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు రాజ్యసభలో పలు హోదాల్లో ఆయన పని చేశారు. ఇటీవలి కాలంలోనూ భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా సేవలు అందించారు. సీఆర్ ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా కూడా ఉన్నారు. లోక్ సత్తా లో కూడా కొంత కాలం పాటు ఆయన సేవలు అందించారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ను ముంచెత్తిన ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. 15 కిలో మీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్..

70 సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న సోలిపేట రామచంద్రారెడ్డిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మహాకవి డాక్టర్.సి నారాయణ రెడ్డి.. సొలిపేట రామచంద్రారెడ్డికి వియ్యంకుడు అవుతారు. సినారే తన చిన్న కూతురును రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డితో వివాహం జరిపించారు. కాగా.. ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని 272 ఏ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.