Asianet News TeluguAsianet News Telugu

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి పొంచివున్న వర్షం ముప్పు

రానున్న రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

This two days heavy rains in AP
Author
Amaravathi, First Published Oct 19, 2020, 2:04 PM IST

అమరావతి: ఇప్పటికే భారీ వర్షాలు, వరద నీటితో ఆంధ్ర ప్రదేశ్ ప్రజానికం  సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్లు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా  భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  ఉపరితల ఆవర్తనాల కారణంగా సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇది క్రమేపీ బలపడి రేపటి(మంగళవారం)కి తీవ్ర అల్పపీడనంగా మారనుందని తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

read more   ‘‘ గంగ వస్తుంది రా’’: హైదరాబాద్ వరదలు.. నిజమైన భవిష్యవాణి మాట (వీడియో)

మంగళవారం కోసాంధ్రలో భారీ వర్షాలు కురుసే అవకశాముందని హెచ్చరించారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా వుండాలని సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా కృష్ణా నదికి వరద పోటెత్తే అవకాశం వుంది కాబట్టి పరివాహక ప్రజలను అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios