Asianet News TeluguAsianet News Telugu

‘‘ గంగ వస్తుంది రా’’: హైదరాబాద్ వరదలు.. నిజమైన భవిష్యవాణి మాట (వీడియో)

హైదరాబాద్ వరదల గురించి బోనాల సందర్భంగా భవిష్యవాణి ముందే హెచ్చరించింది. గంగ వస్తుంది రా.. అంతా కొట్టుకుపోతుంది, ఇంక మీరు ఆలోచించేది లేదు. నేను చెప్పేది లేదు. ఏడుగురు అక్కాచెల్లెళ్లం.. ఆగమేఘాల మీదున్నాం. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అందరూ జాగ్రత్తగా ఉండాలని స్వర్ణలత చెప్పింది

ujjaini mahankali bonalu bavishyavani prediction proved true on hyderabad floods
Author
Hyderabad, First Published Oct 18, 2020, 9:54 PM IST

భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయింది. వరద ఉద్ధృతి నుంచి కోలుకునే లోపే రాత్రి మరోసారి వర్షం పడటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. చెరువులకు గండ్లుపడటంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరద ప్రవాహం తగ్గడంతో ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఏం జరిగిందోనని తేరుకునే లోపే ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులను ఇళ్లపైకి ఎక్కించారు. మరి కొందరు ఆ నీటిలోనే ఎత్తైన ఇళ్లకు చేరుకున్నారు. చూస్తూ ఉండగానే వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.

అయితే ఈ విపత్తు గురించి బోనాల సందర్భంగా భవిష్యవాణి ముందే హెచ్చరించింది. గంగ వస్తుంది రా.. అంతా కొట్టుకుపోతుంది, ఇంక మీరు ఆలోచించేది లేదు. నేను చెప్పేది లేదు. ఏడుగురు అక్కాచెల్లెళ్లం.. ఆగమేఘాల మీదున్నాం. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అందరూ జాగ్రత్తగా ఉండాలని స్వర్ణలత చెప్పింది.

ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు. 

 

"

Follow Us:
Download App:
  • android
  • ios