Asianet News TeluguAsianet News Telugu

ఈ ఎమ్మెల్యేకు పిచ్చి వుందట...

ఈల వేసి, చప్పట్లు  కొట్టి, భజన చేయకపోతే టిడిపి బాబులకు ఖంగారెక్కువవుతూ ఉంది

This MLA says he  is mentally sick

తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ‘నేను అసలే పిచ్చోడిని...నన్ను రెచ్చగొట్టొ’’ద్దంటూ ఉన్న విషయం బయటపెట్టారు. బాస్ బాబు లాగే తమ్ముళ్లకు  ఈ మధ్య అసహనం తెగు పెరిగిపోతూ ఉంది. ఈల వేసి, చప్పట్లు  కొట్టి భజన చేయకపోతే ఖంగారెక్కువవుతూ ఉంది. చిరాకు పడుతున్నారు. ప్రశ్నించి ప్రతివాడిలో ఎవరో శత్రువుని, లేదా జగన్నో చూస్తున్నట్లుంది.

 

నిన్న ఎంజరిగిందో చూడండి. 

 

కొత్తపల్లి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద బుధవారం నాడు ఎన్టీఆర్‌ భరోసా   కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  దానికి ముఖ్య అతిధి ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ. ఇకేముంది మైకాసురుడై విజృంభించాడు. గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నం, అర్హులైన వారందరికీ పింఛన్లు చెడామడా ఇచ్చేస్తున్నాం ముఖ్యమంత్రి దండకం చదవడం మొదలుపెట్టారు.

 

దీంతో అక్కడి ఎస్సీపేటకు చెందిన ఒక  మహిళ నిలబడి,‘ఎందయ్యా నీగోల? ఎక్కడ రోడ్లేశావో చూపించు,‘ అంది.

 

అంతేకాదు,  “రోడ్లు సామాన్య ప్రజల ఇళ్ళ కాడికి రావడం లేదేందుకు?మీ పార్టీ నాయకులు ఇళ్ళ వద్ద చక్కగా రోడ్లేసుకుని రోడ్లేస్తున్నావని చెబుతున్నావ్. రా, మా పేటకు వచ్చి చూడు, వర్షం వస్తే మా వీధిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది.  కుమారుడు చనిపోయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తన కోడలకు పింఛను మంజూరు చేయలేదు,” అని   నిలదీసింది.

 

ప్రజాప్రతినిధిగా ఆమె నిలదీత వెనక ఉన్న ఆవేదనను అర్థకం చేసుకోకుండా, ఎమ్మెల్యే పిచ్చిపట్టినట్లు మాట్లాడట. ‘నేను అసలే పిచ్చోడిని నన్ను రెచ్చగొట్టొద్దు, కూర్చో మాట్లాడకుండా,‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇసుకపల్లికి చెందిన  టి.మంగ అనే ఒకామెను  పింఛను మంజూరైందని చెప్పి సభకు రప్పించారు. కొత్త పింఛను వస్తుందని ఆశగా వచ్చిన ఆమెకు పింఛనును మంజూరు కాలేదని చెప్పడంతో ఆమె సభలోనే కన్నీళ్ళపర్యంతమైంది.

 

అక్కడ అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే చెప్పేవి ఎంత నిజమోజనాలకు తెలిసిపోయింది.

 

చట్టప్రకారం అంటే ఏమిటో...

 

ఈ మధ్య బాబుకు,  తమ్ముళ్ల కూ ప్రజల మీద, ప్రతికలోళ్ల మీద అసహనం తెగ పెరిగిపోతావుంది. ప్రశ్న అంటే బెంబేలు పడిపోతున్నారు.

 

 ప్రశ్నించే వాడు ఎవడు,బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని అక్కడే నిలదీసి జడిపిస్తున్నారు.  మొన్నామధ్య చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి విలేకరిని,ప్రత్యేక హోదా నినాదం మళ్లీ వూపందుకుంటున్నదని కదా,మీరే మంటారని అడిగినందుకు, నీకు చెప్పాల్సిన పనిలేదు కూర్చో మని సలహా ఇచ్చారు. నిన్నటికి నిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ పౌండేషన్ వేస్తున్నపుడు కూడా ఇలాగే అసహనం ప్రదర్శించారు. పునాది వేసింతర్వాత విలేకరులతో మాట్లాడారు. పురుషోత్త పట్నం రైతులు ఎకరానికి రూ.60 లక్షలు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా, వారు కోరినంత ఇవ్వలేమని రైతులు అత్యాశకు పోకూడదని అన్నారు.  'పోలవరం, పట్టిసీమ మాదిరిగానే పురుషోత్తమ పట్నం రైతులకూ మేలైన ప్యాకేజీ ఇస్తాం. రైతులూ అత్యాశకు పోవద్దు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే పనులకు పూనుకుంటే చట్టప్రకారం వెళ్లాల్సి వస్తుంది' హెచ్చరించారు.

 

చట్ట ప్రకారం అంటే ఏమిటో...పోలీసుల రంగ ప్రవేశమేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios