మంత్రి పదవి పోయినా చీమకుట్టినట్లు లేదు. ఎందుకుండాలి అనేది ఆయన ప్రశ్న. బాబే జీవితం, బాబేసర్వం. బాబే బతుకు అంటున్న పరమ భక్తుడు
మూడేళ్ల తర్వాత తాను లేకుండా రేపు మంత్రి వర్గ సమావేశం జరుగుతూ ఉంది. దీనిని దిగమింగుకోవడం మామూలు మనిషికి చాలా కష్టం.
అయితే, ఈ సందర్భంగా పదవిపోయిన పల్లె రఘనాథ రెడ్డి చేసిన కామెంట్స్ చూడండి
■ రాష్ట్రానికి దశ, దిశా నిర్దేశించే శక్తి సామర్థ్యం మా పార్టీ అధినేత చంద్రబాబు తోనే సాధ్యం...
■టీడీపీపార్టీ నాకు జీవితాన్ని ఇచ్చింది...పార్టీ కన్న తల్లి లాంటిది..పార్టీ కోసం ప్రాణం ఇస్తా..
■ ఎమ్మెల్యే గా ,ప్రభుత్వ విప్ గా,ఎమ్మెల్సీ,మంత్రిగా ,ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కి జీవితాంతం రుణపడి ఉంటా..
■క్రమశిక్షణ కల్గిన పార్టీ టీడీపీ ది... ఇలాంటి పార్టీలో ఉండడం నా అదృష్టం..
■మా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం శిరోధార్యం..
■రాజకీయ సమీికరణాలతో పాటు, అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించాలనే ఉద్ద్యేశ్యం తో నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవిని తీసి ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెడుతూ, అనంత జిల్లా లో మరో బలమైన సామాజికవర్గమైన బీసీ లకు మంత్రి పదవి ఇవ్వడం సముచిత న్యాయం...ముఖ్యమంత్రి నిర్ణయం హర్షనీయం...
■2019 ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా మంత్రి వర్గంలో మార్పులు చేయడం జరిగింది...ఇందులో భాగంగా అందరికి న్యాయం జరగక పోవచ్చు.... పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భవిష్యతులో తప్పక న్యాయం జరుగుతుంది.... ప్రతి ఒక్కరు ఓపిక తో ఉండాలని, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అధినేత నిర్ణయం శిరోధార్యంగా భావించాలని టీడీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా...
ఇదీ సంగతి...
