Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబులో ఆ హుందాతనం ఏదీ ?

  • ‘ఐటి రంగంలో హైదరాబాద్ ను ఉన్నతస్ధాయిలో ఉంచింది చంద్రబాబునాయుడే’ అని చెప్పిన కెటిఆర్ వ్యాఖ్యలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
This is the difference between KCR  KTR and CBN

‘ఐటి రంగంలో హైదరాబాద్ ను ఉన్నతస్ధాయిలో ఉంచింది చంద్రబాబునాయుడే’ అని చెప్పిన కెటిఆర్ వ్యాఖ్యలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నిజమే హైదరాబాద్ ను ఐటి హబ్ గా తీర్చిదిద్దటంలో చంద్రబాబు కృషిని ఎవరూ తక్కువగా చూడలేరు. కాబట్టే తెలంగాణా మంత్రి కెటిఆర్ కూడా ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు. అందుకే కెటిఆర్ కు అన్ని వైపుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.

కొద్ది రోజులు వెనక్కు వెళితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, 108 అంబులెన్సులు చేస్తున్న సర్వీసుల గురించి గొప్పగా చెప్పారు. ఉద్యమ సమయంలో 108 సర్వీసుల పనితీరు విషయంలో తనకెదురైన అనుభవం గురించి గొప్పగా చెప్పారు.  108 ఘనతంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కుతుందని ప్రకటించారు. అంటే, ఇక్కడ చూడాల్సిందేమిటంటే రాజకీయ వైరం వేరు, చేసిన మంచి పనిని బహిరంగంగా మెచ్చుకోవటం వేరని.

అంటే, తెలంగాణాలో తండ్రీ, కొడుకులు ప్రత్యర్ధులతో వైరాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే చూసారు. ఇంకో విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. కెసిఆర్ కుటుంబాన్ని రాజకీయంగా రేవంత రెడ్డి ఏ స్దాయిలో ముప్పుతిప్పలు పెడుతున్నాడో అందరూ చూస్తున్నదే. కెసిఆర్ కుటుంబమంటేనే చాలా రేవంత రెడ్డి ఒంటికాలిపై లేస్తారు. అటువంటిది ఈమధ్యనే జరిగిన రేవంత్ రెడ్డి పుట్టిన రోజుకు కెసిఆర్ శుభాకాంక్షలు చెబుతూ ఓ బొకే పంపారు.

ఇక్కడే కెసిఆర్, కెటిఆర్-చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా కనబడుతోంది. కెసిఆర్, కెటిఆర్ రాజకీయానికి, వ్యక్తిగతానికి మధ్య ఉన్న తేడాను గ్రహించారు. ఆ లక్షణమే చంద్రబాబులో లోపించింది. ఏపిలో చంద్రబాబు రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకున్నారు. అందుకనే, వైఎస్ కుటుంబంపై చంద్రబాబు అంతటి కక్షసాధింపులకు దిగుతున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టు గురించే తీసుకుంటే వైఎస్ హయాంలోనే చాలా పనులయ్యాయి. 2014 తర్వాత ప్రాజెక్టు విషయంలో జరిగిన పనులు తక్కువే. అయినా పోలవరం గురించి మొత్తం తానే కష్టపడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు చంద్రబాబు.

అదే విధంగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి అంతర్జాతీయ ప్రశంసలు లభిస్తున్నాయి. ఎందుకంటే, విదేశాలకు చెందిన చాలా కంపెనీలు శ్రీసిటీలోనే ఉన్నాయి. శ్రీసిటీ ఖ్యాతి మొత్తం వైఎస్ పుణ్యమే. అయితే, పొరపాటున కూడా ఆ విషయం చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు. ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలోకి, వైఫల్యాలను మాత్రం కాంగ్రెస్, వైఎస్ఆర్ పైకి నెట్టేసే ప్రయత్నాలు అందరూ చేస్తున్నదే.

Follow Us:
Download App:
  • android
  • ios