ఓ బాలుడు ఆడుకుంటూ 300 అడుగులలోతున్న బోరుబావిలో పడిపోయాడు. దాంతో ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు, నిపుణులు రంగంలోకి దిగేసారు. కేవలం 2 అంటే 2 గంటల్లో బాలుడిని ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు తీయగలిగారు.
రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ప్రాంతంలోని ఓ బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి మీనా గుర్తుంది కదా? చిన్నారిని బోరుబావిలో నుండి వెలికి తీయటంలో మనకున్న సాంకేతిక శక్తినంతా ఉపయోగించినా సాధ్యం కాలేదు. చివరకు 60 గంటల తర్వాత చిన్నారిని విగతజీవిగా బయటకు తీయాల్సి వచ్చింది.
అదే చైనాలో జరిగిన ఇటువంటి ఘటనలోనే ఓ బాలుడిని అక్కడి పోలీసులు, సాంకేతిక నిపుణులు వెంటనే కాపాడారు. ఓ బాలుడు ఆడుకుంటూ 300 అడుగులలోతున్న బోరుబావిలో పడిపోయాడు. దాంతో ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు, నిపుణులు రంగంలోకి దిగేసారు. కేవలం 2 అంటే 2 గంటల్లో బాలుడిని ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు తీయగలిగారు.
అంటే సాంకేతికంగా చైనా మనకన్నా ఎంతముందుందో అర్ధమైపోతోంది కదా? మన ప్రభుత్వం కూడా చైనా సాంకేతికతను అందిపుచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే, మన దగ్గర పిల్లలు బోరుబావుల్లో పడటం చాలా సహజం కదా? జనాల్లో ఎటూ చైతన్యం రాదు. కనీసం ప్రభుత్వమన్నా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటే చిన్నారులు బలికాకుండా ఉంటారు.
