MLC Kavitha: నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కేసు విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. 

MLC Kavitha:నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తీరును సవాల్ చేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం కవిత పిటిషన్ ను విచారణ చేపట్టనున్నది. ఈడీ దర్యాప్తులపై టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరంలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి దీనిని విచారించనుంది. అయితే.. నేడు విచారణపై సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.