Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కు ద్రోహం చేస్తే నోరు తెరవలేదు.. ఇప్పుడెలా నోరొచ్చింది: పురంధేశ్వరిపై రోజా ఫైర్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పై  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు చేయడాన్ని మంత్రి రోజా తప్పు బట్టారు.

AP Minister Roja  Responds  Purandeswari Comments on Chandrababu Arrest lns
Author
First Published Sep 25, 2023, 9:24 PM IST

అమరావతి:తమ తండ్రి ఎన్టీఆర్ కు చంద్రబాబు ద్రోహం చేస్తే తప్పని చెప్పటానికి  పురంధరేశ్వరి కి నోరు రాలేదని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి  రోజా  చెప్పారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ చేసిన పద్దతిని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుబట్టారు.

ఈ వ్యాఖ్యలపై  ఏపీ మంత్రి రోజా స్పందించారు. తండ్రికి అన్యాయం జరిగిన సమయంలో  నోరు రాని పురంధేశ్వరికి చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడేందుకు నోరు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పురంధేశ్వరి ఏ పార్టీలో ఉన్నారని ఆమె ప్రశ్నించారు.మనం ఏంచేసినా పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడన్నారు.తనకు ఏచిన్న కష్టం వచ్చినా గుడికి వెళతానన్నారు.

కానీ, చంద్రబాబు ఏమేం చేశాడో తెలియాలంటే నేరుగా ఢిల్లీ వెళ్లాలని రోజా చెప్పారు.స్కిల్ డెవలప్‌మెంట్  కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలుకెళ్ళాడన్నారు. పురంధేశ్వరి ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలీటం లేదని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

also read:మొన్న తొడకొట్టారు... నేడు తోకముడిచారు: బాలకృష్ణపై రోజా సెటైర్లు

గతంలో చంద్రబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.చంద్రబాబు అరెస్టును  బీజేపీ తరపున పురంధరేశ్వరి ఖండిస్తుందంటే ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందన్నారు.గత ప్రభుత్వ హయాంలోనే  బెల్టుషాపులను ప్రోత్సహించిందన్నారు.పురందేశ్వరి,భువనేశ్వరి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రోజా పేర్కొన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఈ నెల 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios