వామ్మో టమాటా.. మదనపల్లె మార్కెట్ లో రూ.196కి చేరిన ధర
ఏపీలోని మధనపల్లి మార్కెట్ లో కిలో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది. మొదటి గ్రేడ్ టమాటా ధర రూ.196లకు చేరింది. సమీప ప్రాంతంలో ఇంత భారీగా మరెక్కడా ధర పలకలేదు.

ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు కిందికి దిగి రావడం లేదు. దాదాపు నెలన్నరగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు టమాటాలు కొనాలంటేనే భయపడుతున్నారు. పంట కోత చివరి దశలో ఉండటంతో టమోటా ధర వరుసగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీంతో తక్కువ పరిణామంలో టమాటాలు మార్కెట్ కు వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా, సప్లయ్ తక్కువగా ఉండటంతో ఈ కూరగాయ ధర మండుతోంది.
అయితే తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్ లో రికార్డు స్థాయిలో టమాటా ధర పలికింది. రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు మదనపల్లె మార్కెట్ కే ఈ కూరగాయను తీసుకొని వస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పోటీ ధరకు టమాటాలు లభించే ప్రదేశం ఇదే. ఇక్కడి నుంచే ఏపీ ప్రభుత్వం కూడా టమాటాలను కొని, రైతు బజార్లలో సబ్సిడీపై అమ్ముతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మదనపల్లె నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించడం ప్రారంభించింది.
ఫలితంగా గత వారం కిలో టమాటా ధర 150కి చేరింది. అయితే శనివారం మదనపల్లెలో టమాటాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేవలం 253 టన్నులు మాత్రమే మార్కెట్ కు వచ్చాయి. మొదటి గ్రేడ్ టమోటా కిలో రూ.196 అత్యధిక ధర పలికింది. ఆ క్వాలిటీలో టమాటాలు రూ.160 వరకు అమ్ముడుపోయాయి. రెండో గ్రేడ్ టమోటా కిలో రూ.156 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది.
దారుణం.. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం.. వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్..
కాగా.. సమీప ప్రాంతాలైన అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో ఇదే అత్యధిక ధరగా ఉంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.