సారాంశం
15 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దుశ్చర్యను వీడియో కూడా తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చిన అవి కామాంధులకు భయాన్ని కల్పించడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు.
7 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ-సీ56ను నింగిలోకి పంపిన ఇస్రో
పోలీసులు, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. అయితే దానిని ఆ బాలురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ లో విషాదం.. నిద్రిస్తున్న బాలుడిపై పడి కాటేసిన పాములు.. చికిత్స పొందుతూ మృతి..
ఈ వీడియో పోలీసు వరకు చేరింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఏ గ్రామంలో తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలిని గుర్తించారు. ముగ్గురు నిందితులను కనుగొన్నారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి కరణ్ సింగ్ తెలిపారు.