కృష్ణా జిల్లా గుడివాడలో ఎస్‌పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం అక్కడి విద్యార్థులతో మూత్రశాలలు కడిగించారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు ఆమె ఎదురు సమాధానం చెప్పారు. చిన్న చిన్న పనులు చేయడంలో ఏం తప్పు ఉందని ఆమె వారిని ప్రశ్నించారు.
ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు. విద్యార్థులకు చక్కగా విద్యా బుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉన్న ఆమె.. ఆ పిల్లలను మూత్రశాలలు కడగాలని ఆదేశించారు. దీంతో పెన్ను పట్టుకొని నోటు పుస్తకాల్లో అక్షరాలు రాయాల్సిన ఆ చేతులు.. చీపురు పట్టుకొని బాత్ రూమ్ లు కడిగాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది.
బాలికపై యువకుడి అత్యాచారం.. ఈ విషయం అందరికీ చెబుతానంటూ అతడి స్నేహితుడు కూడా..
వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడలోని ఎస్‌పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి తీరు వివాదాస్పదంగా మారింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులతో ఆమె పనులు చేయిస్తున్నారు. వంట చేసేందుకు సిబ్బంది రాకపోతే.. హెచ్ ఎం ఆదేశాలతో ఆ పిల్లలే వండిన పాత్రలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారిలో కొందరు పిల్లలు వడ్డిస్తే.. మరి కొందరు విద్యార్థులు భోజనం చేయాలి.
వివాహేతర సంబంధాల వల్ల కలిగిన పిల్లలకూ.. ఆస్తిలో వాటా - సుప్రీంకోర్టు కీలక తీర్పు..
అయితే తాజాగా ప్రధానోపాధ్యాయురాలు అక్కడి పిల్లలతో శుక్రవారం మూత్రశాలలు కడిగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ అయ్యాయి. అవి తల్లిదండ్రులకు చేరడంతో వారు ఆమెను ప్రశ్నించారు. విద్యార్థులు చిన్న చిన్న పనులు చేస్తే తప్పు ఏంటని ఆమె వారికే ఎదురు సమాధానం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు: గత కమిటీలు, కమిషన్లు ఏం చెప్పాయంటే..?
అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు దృష్టికి వెళ్లింది. దీంతో పిల్లలతో మూత్రశాలలు కడిగించిన ఘటనపై విచారణ చేపట్టాలని డీఈవోను ఆదేశించారని తెలుస్తోంది. కాగా.. ఆ హెచ్ ఎం తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె విషయంలో ఫిర్యాదు చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు.
