బాలికపై యువకుడి అత్యాచారం.. ఈ విషయం అందరికీ చెబుతానంటూ అతడి స్నేహితుడు కూడా..
ప్రేమిస్తున్నాని వెంటబడి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు బాలికపై అత్యారానికి ఒడిగట్టాడు. ఈ విషయం అందరికీ చెప్పేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ.. అతడి స్నేహితుడు కూడా బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డిలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే ఈ విషయం తెలిసిన అతడి స్నేహితుడికి తెలిసింది. అత్యాచారం విషయం అందరికీ చెప్పేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ అతడు కూడా దారుణానికి పాల్పడ్డాడు.
పోలీసులు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి సిటీలో ఉన్న ఓ కాలనీలో 17 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఆమె ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అయితే ఆమె నివసిస్తున్న కాలనీలో ఫయాజ్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రస్తుతం అతడు డిగ్రీ చదువుతున్నాడు. కొన్ని రోజులు ఆమెను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికకు మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో ఒక రోజు ఆ బాలికను తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు.
తెలిసిన వ్యక్తే కదా అని ఆ బాలిక నమ్మి ఫయాజ్ ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెపై యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ విషయం అతడి స్నేహితుడు అల్తాఫ్ కు తెలిసింది. దీనిని ఒక అవకాశంగా తీసుకొన్నాడు. అత్యాచారం అందరికీ చెప్పేస్తానని ఆ బాలికను బెదిరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ అతడు కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరు స్నేహితులు దాదాపు మూడు నెలల నుంచి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే కొన్ని రోజులు బాలిక చలాకీగా ఉండటం లేదు. ఈ విషయం తల్లి గమనించింది. ఒక రోజు కూతురితో మాట్లాడి ఏం జరిగిందో అరా తీసింది. దీంతో బాలికపై తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి వివరించింది. తల్లి వెంటనే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించామని డీఎస్పీ ప్రకాశ్ పేర్కొన్నారు.