అమరావతి: ప్రజా వేదికను కూల్చి వేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించడాన్ని టీడీపీ  నేతలు తప్పుబడుతున్నారు. ఎల్లుండి  అక్రమ కట్టడాలను తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  మెయిన్‌గేట్ నుండి  కాకుండా  వెనుక గేటు నుండి వెళ్లాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ప్రజా వేదికను నిర్మించారని  కలెక్టర్ల సమావేశంలో సీఎం వైఎస్  జగన్ ప్రకటించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు రూపొందించిన నివేదికను కలెక్టర్ల సమావేశంలో చదివి విన్పించారు.

అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయాలని  కలెక్టర్ల సమావేశం నుండే జగన్ అధికారులను ఆదేశించారు. ఎల్లుండే ప్రజా వేదికను కూల్చివేయాలని ఆయన తేల్చి చెప్పారు. అదే సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.

ఈ భవనాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబునాయుడు లేఖ రాసినా కూడ సీఎం నుండి ఎలాంటి సమాధానం రాని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అక్రమంగా ఈ భవనాన్ని నిర్మిస్తే అదే భవనంలో ఎందుకు సమావేశం పెట్టారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టర్ల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల గురించి టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రజా వేదిక నిర్మాణానికి సీఆర్‌డీఏ అనుమతి కూడ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూడ అక్రమంగానే నిర్మించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎల్లుండి ప్రజా వేదికను తానే దగ్గరుండి ప్రజా వేదిక కూల్చివేతను ప్రారంభిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

చంద్రబాబునాయుడు నివాసం కూడ అక్రమ నిర్మాణమేనని ఆయన తేల్చిచెప్పారు. ఈ నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేయాలని  ఆయన కోరారు.  చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశాన్ని ముగించుకొని  వెళ్లిపోతున్న టీడీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాన మార్గం నుండి కాకుండా వెనుక మార్గం నుండి వెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు

జగన్ ప్లాన్: అదే నా వాంఛ, వైఎస్ఆర్‌ను మరిపిస్తారా?

గ్రామాల్లోనే ఒక్క రోజు అధికారులు బస చేయాలి: సీఎం జగన్

ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు ఓటు చేస్తారు: వైఎస్ జగన్

ఎంతటి వాడైనా అవినీతికి పాల్పడితే సహించం: జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి: జగన్