Asianet News TeluguAsianet News Telugu

సర్వత్రా ఉత్కంఠ

చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఒక్కరోజు తేడాలో అంటే బుధ, గురువారాల్లో విడుదలవుతున్నాయి. దాంతో వాళ్ళ అభిమానుల కోలాహలం కోళ్ళ పందేలకు ఏమీ తగ్గటం లేదు.

tension mounting every where

రాష్ట్రంలో రెండు అంశాల్లో ఉత్కంఠ మొదలైంది. ఒకటిః ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్ళ పందేలు నిర్వహించటం. రెండుః ఇద్దరు అగ్రహీరోల భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుండటం. కోళ్ళ పందేలు జరుగుతాయా జరగవా? తమ అభిమాన సినిమాలు హిట్ అవుతాయా ? కావా ? హిట్ అయితే ఏరేంజిలో అవుతాయోనే విషయంపైనే అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.  మొదటి అంశం న్యాయస్ధానానికి ఎక్కి వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక, రెండో అంశమైన సినిమాల్లో అంతర్లీనంగా కుల ప్రభావం స్పష్టంగా కనబడుతుండటం.

 

మొదటి విషయానికి వస్తే, సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ళ పెందేలు నిర్వహించటం సాధారణమే కాదు ప్రతిష్టాత్మకం కూడా. వందల కోట్ల రూపాయల్లో ఈ పందేలుంటాయి. మిగిలిన విషయాలెలా ఉన్నా కోళ్ళ పందేల విషయంలో మాత్రం రాజకీయ పార్టీల నేతలందరూ ఏకమైపోతారు. దాంతో కోళ్ళపందేల నిర్వహణ దశాబ్దాల తరబడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతోంది.

 

ఈ నేపధ్యంలోనే జంతు ప్రేమికుల సంఘం ఒకటి కోళ్ల పందేల నిర్వహణకు నిషేధించాలంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. దాంతో పందేల నిర్వహణపై సందిగ్దత ఏర్పడింది. న్యాయస్ధానం స్టే విధించటాన్ని సుప్రింకోర్టులో సవాలు చేసినా స్పష్టమైన తీర్పు అయితే రాలేదు. ఇదే అదునుగా నిర్వాహకులు మాత్రం పందేలకు మొత్తం సిద్ధమైపోతున్నారులేండి.

 

ఇక, రెండో అంశం సినిమాలు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఒక్కరోజు తేడాలో అంటే బుధ, గురువారాల్లో విడుదలవుతున్నాయి. దాంతో వాళ్ళ అభిమానుల కోలాహలం కోళ్ళ పందేలకు ఏమీ తగ్గటం లేదు. దానికి తోడు ఇద్దరు అగ్రహీరోలు కూడా రెండు ప్రధానమైన సామాజికవర్గాలకు చెందినవారవటం కూడా అభిమానుల్లో సందడికి కారణమౌతోంది.

 

తమ హీరో సినిమానే హిట్ అవుతుందంటే కాదు తమ హీరో సినిమానే హిట్ అంటూ పందేలు కూడా భారీగా సాగుతున్నాయి. ఇద్దరూ అగ్రహీరోలే కావటంతో సినిమా థియేటర్ల వద్ద ఎటువంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios