ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై: తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి Ys Jagan బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ bail ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ Raghurama krishnam raju తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
also read:జగన్ బెయిర్ రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశా.. రఘురామ
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని Cbi కోర్టులో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో Telangana High court లో ఈ ఏడాది అక్టోబర్ 6న మరో పిటిషన్ ను రఘురామకృష్ణంరాజు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ సీఎం వైఎస్ కు తెలంగాణ హైకోర్టు ఈ నెల 13న notice జారీ చేసింది. ఆస్తుల కేసులో జగన్ పై చార్జీషీట్లు ఉన్నాయని కోర్టుకు రఘురామకృష్ణంరాజు ఆ పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. బెయిల్ రద్దు చేసి సీబీఐ దాఖలు చేసిన Charge sheets పై విచారణను వేగవంతం చేయాలని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణంరాజు కోరారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. సీఎం హోదాలో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని న్యాయవాది వాదించారు.ఈ వాదనలను జగన్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. అయితే ఈ కేసులో సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే కేసులో పురోగతి లేదని సీబీఐ కోర్టులో చెప్పినట్టుగానే కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని హైకోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఆరోపించింది.