ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌లో కీలక వాదనలు : విచారణ ఈ నెల 25కి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
హైదరాబాద్:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.
సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర అనిల్ వాదనలు వినిపించారు. బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును కోరింది సీబీఐ,వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. వివేకా హత్య. పథకం అమలు చేయడంలో గంగిరెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ తరపు న్యాయవాదలుు హైకోర్టులో వాదించారు .
గతంలో సిట్ చార్జీషీట్ దాఖలు చేయనందునే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందని సీబీఐ న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్రను చేధించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ తరపు న్యాయవాదులు చెప్పారు.
అన్ని పరిశీలించిన తర్వాతే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు ఏపీ హైకోర్టు నిరాకరించిందని ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాది గుర్తు చేశారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే అనుమనంతో బెయిల్ రద్దు చేయరాదని గంగిరెడ్డి తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు విన్పించారు.
also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ట్విస్టిచ్చిన సునీతారెడ్డి:: మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో పిటిషన్
ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ చేసిన వాదనను వైఎస్ సునీతారెడ్డి న్యాయవాది సమర్ధించారు. సునీతారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు విన్పించారు