పై అధికారినే చెప్పుతో కొట్టిన టీచర్

పై అధికారినే చెప్పుతో కొట్టిన టీచర్

లైగింక వేధింపులకు గురై కుమిలిపోతున్న మహిళలు ఒకవైపు ధైర్యంగా ఎదురు తిరుగుతున్న మహిళలు ఇంకోవైపు. మహిళల్లో ఉన్న రెండు పార్శ్వాలను మనం రోజూ చూస్తూనే ఉంటాము. లైంగిక వేధిపులను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళా టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే, తనను లైంగికంగా వేధిస్తున్న మండల విద్యాశాఖాధికారికే ఓ టీచర్ ఎదురుతిరిగింది. అంతేకాదు చెప్పుతీసుకుని ఆ చెంపా ఈ చెంపా కూడా వాయించేసింది.

ప్రస్తుత విషయంలోకి వస్తే, ప్రకాశం జిల్లా మార్కాపురం మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న రామ్‌దాస్‌నాయక్‌ కొద్ది రోజులుగా ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. అయితే ఇతని వేధింపులను కొంత కాలం పాటు సహనంగానే భరించింది. ఎందుకు భరించిందంటే తనపై అధికారి కాబట్టే. అయితే, టీచర్ సహనాన్ని సదరు అధికారి చేతకాని తనంగా భావించినట్లున్నారు. అందుకనే వేధింపుల మోతాదును పెంచారు. దాంతో సదరు టీచర్ ఇహ లాభంలేదనుకున్నారు.

మంగళవారం టీచర్ ఎదురుపడినపుడు మంఇవో తనలోని సహజబుద్దిని బయటపెట్టారు. దాంతో తట్టుకోలేని టీచర్ వెంటనే కాలి చెప్పు తీసి వాయించేశారు. రెండు చెంపలు వాయించటం మొదలు పెట్టేసరికి చుట్టుపక్కలున్న టీచర్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని టీచర్ చెప్పు దెబ్బల నుండి ఎంఇఓను పక్కకు లాగేసారు.  టీచర్ కు సర్దిచెప్పి శాంతిపచేసి ఎంఇవోను అక్కడి నుండి పంపేశారు. అయితే, విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కటంతో సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఎంఈవో చేష్టల వల్ల విద్యావ్యవస్థకే మచ్చ వచ్చిందని, ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page