టిడిపికి 110 సీట్లు, వైసీపీకి 60, పవన్ కి నామమాత్రమే: లగడపాటి సర్వే

Tdp will win 110 seats in 2019 elections says RG flash team survey
Highlights

బాబుకే పట్టం కట్టనున్న ఏపీ ప్రజలు


అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 110 సీట్లు లభిస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి 60 సీట్లు మాత్రమే దక్కనున్నాయని తేల్చి చెప్పింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేల్చి చెప్పింది.


ఆర్జీ ఫ్లాష్ టీమ్‌తో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు నిర్వహిస్తారని గతంలో పలుమార్లు ప్రకటించారు. అయితే ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎబిఎన్ కోసం ఆర్జీఫ్లాష్ టీమ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేను ఎబిఎన్ విడుదల చేసింది. 2019 ఎన్నికల్లో కూడ టిడిపిదే అధికారమని ఈ సర్వే తేల్చింది. జనసేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని ఆ సర్వే ప్రకటించింది.

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై సర్వే నిర్వహించారు. ఎబిఎన్ ఛానెల్ కోసం లగడపాటి రాజగోపాల్ నిర్వహించినట్టు ఎబిఎన్ ఛానెల్ ప్రకటించింది. ఈ సర్వే వివరాలను ఎబిఎన్ ఛానెల్ శనివారం సాయంత్రం విడుదల చేశారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టిడిపికి 110 సీట్లు, వైసీపీకి 60 సీట్లు లభిస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది.టిడిపికి 43.83 శాతం ఓట్లు, వైసీపీకి 37.46 శాతం ఓట్లు లభించనున్నాయని ఆ సర్వే ప్రకటించింది.

 

ప్రత్యేక హోదా కోసం 43.83 శాతం మంది పోరాటం చేస్తోందని ఈ సర్వేలో ప్రజలు మద్దతు ప్రకటించారు. వైసీపీ ప్రత్యేక హోదా కోసం 37.46 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.ఏపీ సీఎం పనితీరుపై 53.69 శాతం ప్రజలు సంతృప్తి చెందగా, సుమారు 46 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 44.04 శాతం ఓట్లు, వైసీపీకి 37.46 శాతం, జనసేనకు 8.90 ఓట్ల శాతం ఓట్లు, బిజెపికి కేవలం 1.01 శాతం ఓట్లు మాత్రమే దక్కనున్నాయి. ఇతరులకు 3.19 శాతం ఓట్లు  దక్కనున్నాయని ఈ సర్వే తేల్చింది. ఈ లెక్కన టిడిపికి 110 సీట్లు, వైసీపీకి 60 సీట్లు, ఇతరులకు 5 స్థానాలకు దక్కనున్నాయి. జనసేన ప్రభావం నామమాత్రంగా ఉండనుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.


గత ఎన్నికల్లో టిడిపికి 8 సీట్లు అదనంగా దక్కనున్నాయి. 2014లో టిడిపికి 102 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీకి గతంలో కంటే 7 సీట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. బిజెపి 14 సీట్లలో పోటీ చేసి కేవలం 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది.

 

ఏపీ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ అన్యాయం చేశారా లేదా అనే విషయమై సర్వే నిర్వహిస్తే సుమారు 83.67 శాతం మంది అవును అంటూ సమాధానాన్ని చెప్పారు.ఏపీకి మోడీ అన్యాయం చేయలేదని కేవలం 16.33 శాతం మంది మాత్రమే  చెప్పారని ఈ సర్వే ఫలితాలు ప్రకటించాయి.


ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. అనంతపురం నుండి కృష్ణా జిల్లాలో సర్వే నిర్వహించగా టిడిపికి 46.81 శాతం, వైసీపీకి 36.46 శాతం ఓట్లు మాత్రమే దక్కనున్నాయి. పాదయాత్ర సాగిన జిల్లాల్లో కూడ వైసీపీకి ఆశించిన ప్రయోజనం ఆ పార్టీకి లేదని ఈ సర్వే చెబుతోంది.

ఇక ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్రలో టిడిపికి 39.05 శాతం ఓట్లు, వైసీపీకి 35.23 శాతం, జనసేనకు 12.70 శాతం ఓట్లు దక్కనున్నాయి. కోస్తాలో టిడిపికి 46.09 శాతం ఓట్లు దక్కనున్నాయని చెప్పారు. వైసీపీకి 36.79 శాతం ఓట్లు దక్కనున్నాయి. జనసేనకు 7.30 శాతం ఓట్లు దక్కనున్నాయని ఈ సర్వే తేల్చింది. రాయలసీమలో టిడిపికి 44.12 శాతం ఓట్లు, వైసీపీకి 40.47 శాతం ఓట్లు, జనసేనకు 8.74 శాతం ఓట్లు దక్కనున్నాయని ఈ సర్వే తేల్చింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనితీరు 53.69 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారు. బాబు పనితీరుపై 46.31 శాతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

 

loader