Asianet News TeluguAsianet News Telugu

తూచ్.. ఆ మూడు పార్టీలు ఒక్కటి కావు: మాట మార్చిన అయ్యన్నపాత్రుడు

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనేది నిజం కాదన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఉదయం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించడంతో అయ్యన్న మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పరిస్థితులు 3 పార్టీలు కలిసేలా ఉన్నాయని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ఆయన స్పష్టం చేశారు

TDP Senior leader ayyannapatrudu clarifies his comments on early elections
Author
Visakhapatnam, First Published Sep 4, 2019, 6:27 PM IST

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనేది నిజం కాదన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఉదయం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించడంతో అయ్యన్న మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

పరిస్థితులు 3 పార్టీలు కలిసేలా ఉన్నాయని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ఆయన స్పష్టం చేశారు. అవంతి పార్టీ మారి ఎమ్మెల్యే, మంత్రి అవుతారని అనుకున్నామా అని అయ్యన్న ప్రశ్నించారు.

గతంలో పాదయాత్రలకు ఇబ్బందులు కలగకూడదని చంద్రబాబు చెప్పేవారని.. ఇప్పుడు మేం రక్తదానం చేస్తామన్నా సరే రాజకీయం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ధవారం నాడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యన్నపాత్రుడు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హెల్మెట్లు ఉంటేనే బైక్ ర్యాలీకి అనుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీంతో  బైక్‌లను తోసుకొంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో  పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడారని ఆయన చెప్పారు. వారి మాదిరిగా రౌడీలు, గుండాలు తమ పార్టీలో ఎవరూ కూడ లేరని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి... మీరంతా మా వద్దే పనిచేయాలి... అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని  అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అన్యాయంగా ప్రవర్తించడం లేదన్నారు.

ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని ర్యాలీలు నిర్వహించారా అని ఆయన ప్రశ్నించారు.పోలీసులు తమ తీరును మార్చకోకపోతే పోలీస్‌స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

మూడేళ్లలో ఎన్నికలు: అయ్యన్నపాత్రుడి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు షాక్: టీడీపికి అయన్నపాత్రుడి సోదరుడు రాజీనామా

 విశాఖలో టీడీపీకి షాక్...వైసీపీలోకి కీలక నేత?

బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లడాయి:మంత్రి అయ్యన్నకు తలనొప్పి

Follow Us:
Download App:
  • android
  • ios